నల్లగొండ జిల్లా: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ శనివారం పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ,భువనగిరి రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్డులను ఖరారు చేశారు.
నల్లగొండ నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా క్యామ మల్లేశ్ పేర్లను ప్రకటించారు.
దీంతో ఇప్పటి వరకు ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల సంఖ్య 16 స్థానాలకు చేరింది.
ఇక హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మాత్రమే పెండింగ్‌లో ఉంది.త్వరలోనే ఈ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం.