నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో మహిళలకు నెలకు రూ.2,500.అందించే మహాలక్ష్మి పథకంపై సోషల్ మీడియా( Social media )లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచించారు.
18-55 ఏళ్ల లోపు మహిళలే ఈ పథకానికి అర్హులని, కుల-ఆదాయ ధ్రువీకరణ పత్రాలు,కరెంట్ బిల్లు తప్పనిసరి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని,దీనితో మహిళలు ఆయా గుర్తింపు కార్డుల కోసం మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారని,ఈ పథకంపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని,ఎవరూ చెప్పినా ఏదీ నమ్మకండని అధికారులు తెలిపారు.