నల్లగొండ జిల్లా:కేంద్రంలో బీజేపీ( BJP ) అధికారంలో ఉందని, రాష్ట్రంలో కూడా బీజేపీ ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని నాగార్జున సాగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంకణాల నివేదిత రెడ్డి అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా( Nalgonda District ) నాగార్జునసాగర్ నియోజకవర్గ( Nagarjuna Sagar Assembly constituency ) పరిధిలోని హాలియా పట్టణంలో గడప గడపకు బీజేపీ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వారసత్వ రాజకీయాన్ని తరిమికొట్టి, మహిళగా ఒక్కసారి అవకాశం కలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి( Kankanala Sridhar Reddy ),బీజేపీ రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్,బీజేపీ నాగార్జునసాగర్ నియోజకవర్గ కన్వీనర్ చలమల వెంకట్ రెడ్డి,అనుముల మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.