శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది

నల్లగొండ జిల్లా:శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందన్న స్వామి వివేకానంద వ్యాఖ్యలను నల్గొండ టూ టౌన్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి క్రీడాకారులకు గుర్తు చేశారు.నల్గొండ చత్రపతి శివాజీ కబడ్డీ&ఫుట్బాల్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన మైదానం పూజా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాల దశ నుండి సమయాన్ని వృధా చేయకుండా తను ఎంచుకున్న రంగంలో అనునిత్యం ఇష్టపూర్వకంగా పనిచేయడం వల్ల జీవితంలో సక్సెస్ సాధించడమే కాకుండా బంగారు భవిష్యత్తు పొందవచ్చునని తెలిపారు.

 If Hard Work Is Your Weapon, Success Will Be Your Slave-TeluguStop.com

అనంతరం సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాలడుగు రంజిత్ క్రీడాకారులకు పుట్ బాల్స్ ను ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ద్వారా అందజేశారు.ఈ కార్యక్రమంలో కవి ఏడుకొండలు,చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు,ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్,ఫిట్నెస్ కోచ్ భాగిడి అర్జున్,సీనియర్ క్రీడాకారులు గాలం వేణు,రామావత్ అశోక్,గునుకుల శివ సాయి,బెల్లి రాజు,కొండేటి మహేష్,పులకరం మౌనిక,పిల్లి భరత్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube