అంధ్రా జల దోపిడీతో నిలిచిపోయిన రివర్స్ బుల్ విద్యుత్ ఉత్పత్తి

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ డ్యాం 1977లో నిర్మాణం పూర్తి అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరుకు ఏ ప్రభుత్వం రివర్స్ బుల్ విద్యుత్ ఉత్పత్తిని వాడుకలోకి తీసుకరాలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాకా రివర్స్ బుల్ విద్యుత్ అవశ్యకతను గుర్తించి 2019 లో రివర్స్ బుల్ విద్యుత్ ఉత్పత్తిని నాగార్జున సాగర్ డ్యాం జలవిద్యుత్ కేంద్రంలో గత ప్రభుత్వం ప్రారంభింది.

నాగార్జునసాగర్ డ్యాం దిగువన టెయిల్ పాండ్ డ్యాంను నిర్మించి 7 టీఎంసీల నీటిని నిల్వ చేసేవారు.నదిలో నీటి నిల్వలు తక్కువగా ఉన్న సమయంలో నాగార్జునసాగర్ డ్యాం ముందు భాగంలో నిల్వ ఉన్న 7 టీఎంసీల నీటిలో టీఎంసీ నీటిని వినియోగిస్తూ అత్యవరసర సమయంలో రివర్స్ బుల్ ద్వారా విద్యుత్ ఉత్పతి చేపట్టేవారు.

ఈ పక్రియ నదిలో నీరు లేకపోయినా ఏడాది పొడుపునా కొనసాగేది.ఈ నెల 13 న టెయిల్ పాండ్ డ్యాం వద్ద ఆంధ్రా అధికారులు డ్యాం గేట్ తెరిచి రివర్స్ బుల్ విద్యుత్ ఉత్పత్తి కోసం నిల్వ చేసిన నీటిని పూర్తిగా వాడుకున్నారు.

తెలంగాణ జెన్కో,ఇరిగేషన్ అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆంధ్రా అధికారులు 4 టీఎంసీల నీటిని వాడుకున్నారు.దీనితో నాగార్జునసాగర్ డ్యాం సమీపంలో రివర్స్ బుల్ విద్యుత్ కోసం నిల్వ ఉన్న నీరు పూర్తిగా ఖాళీ అయి రాళ్ళు బయటపడడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

Advertisement

నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్ర సీఈ మంగేష్ కుమర్ ను వివరణ కోరగా తమకు ఎటువంటి సమాచారం లేకుండానే ఆంధ్రా అధికారులు రివర్స్ బుల్ కోసం నిల్వ ఉన్న 4 టీఎంసీల నీటిని వాడుకున్నారు.ఆంధ్ర అధికారులను నీటి వాడకంపై వివరణ కోరగా తమ వద్ద నీటి వినియోగంపై ఉత్తర్వులు ఉన్నాయని చెప్పుతున్నారు.

ఉత్తర్వులు చూపించమని అడిగితే వారు చూపించడం లేదు.నాగార్జునసాగర్ డ్యాం ముందు భాగంలో నిల్వ నీటిని ఆంధ్రా వాడుకోవడంపై ఉన్నతాధికారులకు తెలియపరిచామని అన్నారు.

Advertisement

Latest Nalgonda News