విచారణకు డుమ్మా కొట్టిన జర్నలిస్టులు...!

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలో ఎనిమిది మంది జర్నలిస్టులు 59జీవో అడ్డంపెట్టుకుని సుమారు రూ.10 కోట్ల విలువ చేసే భూమిని కాజేశారనే ఆరోపణలపై శనివారం జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టారు.కానీ,ఈ విచారణకు ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులు హాజరు కాకపోవడం గమనార్హం.దీనితో విచారణకు హాజరైన నల్లగొండ తహశీల్దార్,మున్సిపల్ కమీషనర్లను అక్రమ రిజిస్ట్రేషన్లు,ఇంటి నెంబర్ల కేటాయింపుపై జేసీ విచారించారు.

 Journalists Who Are Silent On Investigation , Nalgonda District , Nalgonda Journ-TeluguStop.com

ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్( Registration house plots ) అక్రమమని మండల తహశీల్దార్ చెప్పినట్లు,ఇంటి నెంబర్లు కూడా తాము ఎవరికీ కేటాయించలేదని మున్సిపల్ కమిషనర్ తెలిపినట్లు,ఇదే విషయం నివేదికగా తయారుచేసి సాయంత్రం వరకు తనకు అందజేయాలని జేసీ ఆదేశించినట్లు,రిజిస్ట్రేషన్ లు రద్దు చేస్తామని కూడా జేసీ చెప్పినట్లు సమాచారం.ఇదిలా ఉంటే అధికారిక నివేదిక కోసం కొందరు జర్నలిస్టులు సాయంత్రం 6 గంటల వరకు ఎదురు చూసినా నివేదిక ఇవ్వాల్సిన అధికారి చంద్రవదన రాకపోవడం,నివేదిక ఇవ్వకపోవడం,కాల్ చేసినా స్పందించక పోవడం కొసమెరుపు.

దీనితో జర్నలిస్టుల అక్రమ భూ దందాపై తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది వేచి చూడాలి మరి…!అయితే59 జీవోను అడ్డం పెట్టుకొని ఫేక్ ఇంటి నెంబర్లతో ఖరీదైన ప్రభుత్వ భూమి కాజేసిన ఎనిమిది జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని నల్గొండ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube