గులాబీ బాస్ కు చెక్ పెట్టేలా మంత్రి కోమటిరెడ్డి మాస్టర్ ప్లాన్...!

నల్లగొండ జిల్లా:రాష్ట్ర రాజకీయాలను నల్లగొండ వేడెక్కిస్తుంది.నల్లగొండలో అధికార,విపక్షాలు పోటాపోటీగా సభలు పెట్టడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ(BRS party ) పెద్దలు ఉవ్విళ్లూరుతున్నారు.

 Minister Komati Reddy's Master Plan To Check The Pink Boss...!-TeluguStop.com

ఈ నెల 13 న మాజీ సీఎం, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు( Kalvakuntla Chandrashekar Rao ) నల్లగొండలో సభ పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.కేసీఆర్ సభకు ధీటుగా 2 లక్షల మందితో నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ భారీ సభ పెట్టడానికి రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సభకు కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని మంత్రి భావిస్తున్నారు.

ఇదే సభలో ప్రియాంకతో( Priyanka Gandhi ) మరో రెండు గ్యారంటీల అమలుకు యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

నల్లగొండలో గులాబీ బాస్ కేసీఆర్ కు చెక్ పెట్టేలా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యూహం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube