నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ లమీద షాక్ తగులుతుంది.కాంగ్రెస్ అభ్యర్ధిగా నేనావత్ బాలూ నాయక్ ను ప్రకటించిన నాటి నుండి అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు.
గురువారం దేవరకొండ 20 వ,వార్డు కౌన్సిలర్ మల్లీశ్వరి అధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్యర్ధి బాలూ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరగా,చింతపల్లి సర్పంచ్ ముచర్ల యాదగిరి సమక్షంలో చింతపల్లికి చెందిన గునుకుల శేఖర్, గునుకుల నరేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం మహిళ అధ్యక్షురాలు, భారత్ జోడో యాత్రికురాలు,యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ప్రచార కమిటీ సభ్యులు జూలురు ధనలక్ష్మి, బాలనారాయణ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, దేవేందర్,చింతపల్లి పిఏసిఎస్ ఛైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, ఎంపీటీసీ-1 నల్లవెల్లి సదానందం,కాసారపు శ్రీనివాస్,ఎలిమినేటి నర్సింహా,ఎల్లెంకి రాధాకిషన్,శీలం రమేష్, మొక్తాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.