రచ్చ బండ దగ్గర ఓటు చర్చ...!

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా పట్టణాల్లో ప్రధాన కూడళ్లు,హోటళ్ల వద్ద గ్రామాల్లోని రచ్చ బండల దగ్గర నలుగురు గుమి కూడితే చాలు ఒక్కటే చర్చ.ప్రధాన పార్టీల్లో గెలిచే అభ్యర్దులు ఎవరూ? రాష్ట్రంలో అధికారం చేపట్టే పార్టీ ఏదీ?పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా యువకుల నుంచి వృద్ధుల వరకు ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల హామీలపై,వివిధ పార్టీల అభ్యర్థులపై రచ్చ జరుగుతుంది.ఏ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేస్తే బాగుంటుంది?ఏ పార్టీ అధికారంలోకి వేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది?ఓటు ఎవరికి వేయాలి?ఎందుకు వేయాలి? అనే చర్చలతో ఎన్నికల వేడి చలి కాలాన్ని సైతం వెచ్చగా మారుస్తుంది.

 Public Discourse On Manifestos Issued By Major Parties , Nalgonda District ,ma-TeluguStop.com

జనరల్ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలు విడుదల చేసిన మ్యానిఫెస్టోల( Manifestos )పై చర్చలతో పాటు,తమ ప్రాంతాల్లో ఏం పనులు జరిగాయి? ఇంకా జరగవలసిన పనులు ఎన్ని ఉన్నాయి? అనే అంశాలు రచ్చకు దారితీస్తున్నాయి.అన్ని పార్టీలు చెప్పే విషయాలు బాగానే ఉన్నాయని గెలిచిన తర్వాత చేస్తారా?లేక గెలిచాక చేయరా? అనే సందేహాలపై పబ్లిక్ చేస్తున్న వాదన ఆలోచన రేకెత్తిస్తున్నాయి.ఇప్పుడుఅధికారంలో ఉన్నవారు పట్టించుకోవడంలేదని కొందరు,కొత్త వారిని గెలిపిస్తే అమలు చేస్తారా? అని మరి కొందరు వారివారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.పోటీలో ఉన్న అభ్యర్థులు అందరూ బాగానే చెప్తున్నారని, అధికారంలోకి వచ్చాక అందరూ అందరేనన్న చందంగా చర్చలు జోరుగా సాగుతున్నాయి.ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఫలానా పార్టీ అభ్యర్థి గెలుస్తాడని ఒకరు అంటే మరొకరు కాదు కాదు ఇంకో పార్టీ అభ్యర్థి గెలుస్తాడని మరొకరు వాదనలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం ఎన్నికల మీదనే కేంద్రీకరించి ఉన్నది.

ఆయా పార్టీల అభ్యర్థుల అనుకూల,ప్రతికూల అంశాలపై చర్చలు జరుగుతున్నా,చివరికి ఓటరు తీర్పు ఎలా ఉండబోతుంది? నెగ్గేదేవరు? ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎవరు? అనేదే ప్రధానంగా జిల్లా ప్రజలు ఆలోచనా విధానంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube