నల్లగొండ జిల్లా:మరణంలో కూడా మానవత్వం పంచి మహా మనిషిగా నిలిచి,ఐదు కుటుంబాలలో వెలుగులు నింపిన కానిస్టేబుల్ బత్తుల విజయ్ కుమార్ అమరుడిగా మిగిలిపోయారు.తన కుటుంబ క్షేమం కన్నా సమాజ క్షేమం కోసం నిరంతరం శ్రమించే పోలీసులు తుదకు తన మరణాంతరం కూడా ఆవయవదానం చేసి సమాజంలోని ఐదు కుటుంబాల్లో వెలుగులు పంచడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ విభాగం 12వ బెటలియన్ నల్గొండ నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బత్తుల విజయ్ కుమార్ మూడు రొజుల క్రితం ద్విచక్ర వాహనంపై వస్తుండగా సాగర్-హలియ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్యాస విడిచాడు.ఈ సంఘటనతో కన్నీరుమున్నీరై విలపిస్తున్న విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు తన ఆశయాలకు జీవపోయాలనే సంకల్పంతో,విజయ్ కుమార్ మరణించిన నలురుగురి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో మరణించిన విజయ్ కుమార్ పార్థీపదేహం నుండి ఆవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఆవయవదానం చేశారు.
ఈ సందర్బంగా విజయ్ కుమార్ పార్థీవదేహం నుండి అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చిన విజయ్ కుమార్ కుటుంబ సభ్యులను టి.ఎస్.ఎస్.పి బెటాలియన్ అడిషనల్ డీజీపీ అభిలాష బిష్త్,కమాండెంట్ 12వ బెటలియన్ ఎన్.వి.సాంబయ్య మరియు బెటాలియన్ ఆఫీసర్లు అభినందించారు.తమ మిత్రుడు తన జీవిత అంకంలోను ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపినందుకు గాను విజయ్ కుమార్ మా మిత్రుడైనందుకు గర్వపడుతున్నట్లుగా 2013 బ్యాచ్ కానిస్టేబుళ్లతో పాటు సహోద్యోగులు అశ్రునయాలతో విజయ్ కుమార్ కు తుదివీడ్కోలు పలికారు.జయహో కానిస్టేబుల్ బత్తుల విజయ్ కుమార్ జయహో తెలంగాణ పోలీస్ అంటూ నినదించారు.