నల్గొండ జిల్లా:జిల్లాలోని ప్రధాన జలాశయం నాగార్జున సాగర్( Nagarjuna Sagar) ప్రాజెక్టు వర్షాకాలం మొదట్లోనే నిండుకుండలా నీటితో కళకళలాడేది.కానీ,ఈ సంవత్సరం ఎగువ నుండి నీరు రాకపోవడంతో ప్రాజెక్ట్ నీటి మట్టం కనిష్ఠ స్థాయికి చేరువలో ఉంది.శనివారం సాయంత్రానికి 517.00 అడుగులుగా, 43.8010 టీఎంసీలుగా నీటి నిల్వ ఉన్నది.దీనితో సాగర్ ఆయకట్టులోని ఎడమ కాలువ కింద సాగుచేసే రైతులకు నీటి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ( Kharif season)ప్రారంభమై రోజులు గడిచినా సాగునీరు విడుదల చేసే అవకాశం లేకపోవడంతో అన్నదాతలు పంటలు వెయ్యాలా వద్దా అనే అయోమయంలో పడ్డారు.
తాగునీటికి తప్ప ఖరీఫ్ పంటకు నీరు అందే పరిస్థితి కనిపించక పోవడంతో రైతుల్లో( Farmers ) ఆందోళన నెలకొంది.
ఎగువన ఉన్న జలాశయాలు నిండితే కానీ,సాగర్ నిండే పరిస్థితి లేదు.ప్రస్తుతం కుడి కాలునకు 5088 క్యూసెక్కులు,ఎస్ఎల్బీసికి 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.