నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) 2024 సంవత్సరానికి సెలవులను ప్రకటించింది.వచ్చే ఏడాదికి 27 సాధారణ సెలవులు,25 పండగ సెలవులను ఖరారు చేసింది.2024 జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం సెలవును ప్రకటించింది.
దీనికి బదులు ఫిబ్రవరి 10వ తేదీన రెండో శనివారం పని దినంగా పేర్కొంది.
జనవరి 15న సంక్రాంతి సెలవు, మార్చి 8న మహా శివరాత్రి( Maha shivaratri ), మార్చి 25న హోలీ,ఏప్రిల్ 9న ఉగాది,ఏప్రిల్ 17న శ్రీరామనవమి,జూన్ 17న బక్రీద్,సెప్టెంబర్ 7న వినాయక చవితి,అక్టోబర్ 10న దసరా,అక్టోబర్ 31న దీపావళి సెలవులు ప్రక టిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.







