ఆర్.ఎస్.పీ పుట్టిన రోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

నల్లగొండ జిల్లా:విద్యార్థిని,విద్యార్థులందరూ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఆదర్శంగా తీసుకోని,ఆయన అడుగుజాడల్లో నడుస్తూ,ఐఏఎస్,ఐపీఎస్,ఐఎఫ్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలు పొందాలని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి పిలుపునిచ్చారు.

 Mega Blood Donation Camp On The Occasion Of Rsp Birthday-TeluguStop.com

బుధవారం నకిరేకల్ పట్టణ కేంద్రంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్.ఎస్.పీ జన్మదినం సందర్భంగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేస్తే వందలాది మంది యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు.థలసేమియా,కేన్సర్,మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు,బ్లడ్‌ కేన్సర్‌ రోగులు,హిమోఫీలియా, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి,జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని,రక్తదానం చేయడమనేది ఒక సామాజిక సేవా కార్యక్రమని,రక్తదానంపై అపోహలు వద్దన్నారు.రక్తదానం మహాదానమని,ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేస్తున్నదన్నారు.

ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి 6 నెలలకొకసారి రక్తదానం చేయాలని సూచించారు.పెద్ద ఎత్తున రక్త దానం శిబిరం ఏర్పాటు చేసిన బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ టీమ్ ను అభినందించారు.

అదేవిధంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన బీఎస్పీ నాయకులకు,కార్యకర్తలకు,యువతకు వాలంటీర్లకు, ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం భారీ కేక్ కట్ చేసి ఆర్.ఎస్.పీ.కి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు.వేల ఏళ్లుగా అంధకారంలోకి నెట్టబడిన జీవితాలలో విద్యతో వెలుగు నింపుతూ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్న జ్ఞాన యోధుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అని కొనియాడారు.సమాజం కోసం,దేశం కోసం,రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం,బహుజన సమాజ నిర్మాణ కోసం ఎందరో అమరవీరులు ప్రాణ త్యాగాలు చేశారని,వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube