ప్రజలను వంచిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం...!

నల్లగొండ జిల్లా: నీళ్లు, నిధులు,నియామకాల పేరిట అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్ అన్నారు.గురువారం స్థానిక పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇయ్యకుండా నిరుద్యోగుల భవిష్యత్ ను ఆగం చేసిందన్నారు.

 Brs Government Is Deceiving People Miryalaguda Congress President Nookala Venugo-TeluguStop.com

రైతులకు పంట రుణమాఫీ హామి నెరవేర్చక,ధాన్యం డబ్బులను బ్యాంకర్లు కట్ చేసుకుంటుండ్రని ఆవేదన వ్యక్తం చేశారు.

మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పెండింగ్ పై అధికార పార్టీ నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.

రాష్ట్ర ఉద్యోగులకు 1వ తేదీన జీతాలియ్యలేని స్థితికి పాలన చేరిందని,ఈ తరుణంలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్నికల ముందు అభివృద్ధి పనుల పేరిట మంత్రులు శంకుస్థాపనలు చేస్తుండ్రని మండిపడ్డారు.సర్కార్ భూముల విక్రయం, అవినీతి పాలనకు నిరసనగా మంత్రుల పర్యటనను అడ్డుకుంటామన్నారు.

మంత్రుల పర్యటనను అడ్డుకునేందుకు యువత తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు చిలుకూరి బాలకృష్ణ,పగిడి రామలింగయ్య,గౌస్, సిద్ధూ నాయక్,గుంజ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube