నల్లగొండ జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది.వారికి రోజువారీ వేతనం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2023-24) కనీస వేతనం రూ.272గా అమలు చేస్తుండగా,
దీనికి అదనంగా మరో రూ.28 జోడించి,ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో(2024-25) రూ.300 ఇవ్వనున్నట్లు సమాచారం.