హైదరాబాద్/నల్లగొండ: ప్రజా సమస్యలపై చర్చించేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావు ను సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రజానేస్తం అవార్డు గ్రహీత,సిపిఐ ఎంఎల్ పార్టీ స్టేట్ సెక్రటరీ బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు బీసీ సంఘాల జేఏసీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.తెలంగాణ రాష్ట్రంలో బడుగు,బలహీనవర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యల మీద,రాజకీయ పరిస్థితుల మీద కామ్రేడ్ కేఎస్ఆర్ తో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, పేద వర్గాల మీద దాడులు, దౌర్జన్యాలు నిరుద్యోగం,కుల వివక్షత, సామాజిక సమస్యలు గురించి భారత సిపిఐ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని అన్నారు.అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా త్వరలో బీసీ సమస్యల మీద, నిరుద్యోగ సమస్య మీద కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మెమోరాండం అందజేస్తామని కూనంనేని తెలిపారని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్,ప్రజానేస్తం,సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ బోరన్న గారి నేతాజీ సుభాష్ తెలిపారు.