తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ ఈయన తేజ గారి దర్శకత్వంలో చిత్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇలా మొదటి సినిమానే మంచి విజయం కావడంతో ఈయన తన తదుపరి చిత్రాన్ని నువ్వే నువ్వే సినిమాని కూడా తేజ దర్శకత్వంలో చేశారు.
ఇలా మొదటి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఈయన క్రేజ్ ఇండస్ట్రీలో అమాంతం పెరిగిపోయింది.
అనంతరం మనసంతా నువ్వే వంటి మరో బ్లాక్ బస్టర్ కొట్టడంతో వరుసగా ఈయన కాల్ షీట్స్ కోసం ఎదురుచూశారు.తేజ ఈయనకు అవకాశం కల్పించడంతో ఈయన ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు ఎదిగారు.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్నటువంటి ఉదయ్ కిరణ్ ఒకానొక సమయంలో తేజ ఫోన్ చేసిన తాను లిఫ్ట్ చేయలేదంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు తేజ ఈ విషయాలను వెల్లడించారు.ఈ విధంగా ఉదయ్ కిరణ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తనకు చాలా కోపం వచ్చిందని తేజ తెలిపారు.
ఇకపోతే ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ కెరియర్ కూడా డౌన్ ఫాల్ కావడం మొదలుపెట్టింది ఇలా వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటున్న సమయంలో తాను తిరిగి ఉదయ్ కిరణ్ తో ఔవునన్నా కాదన్నా సినిమా చేశానని తెలిపారు.అయితే ఈ సినిమా షూటింగుకు ఒక రోజు ముందు ఉదయ్ కిరణ్ తన వద్దకు వచ్చి నేను ఇలా చేసిన మీరు నాకు సినిమా అవకాశం ఇచ్చారు నేను మీ కాళ్లు పట్టుకుంటా నన్ను క్షమించండి అని అడిగారు.నువ్విలా నా కాళ్లు పట్టుకున్న నేను క్షమించనని అలా క్షమిస్తే నీకు ఇంకో తప్పు చేసే అవకాశం నేను కల్పించినట్టు అవుతాను.ఆ అవకాశం నీకు ఇవ్వను.
నువ్వు ఇలాగే ఉండు, నేను ఇలాగే ఉంటా ఇద్దరం కలిసి సినిమా చేసి మంచి హిట్ కొడదాం అంటూ తాను చెప్పానని ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించి తేజ వెల్లడించారు.