నల్లగొండ జిల్లా: నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ లచ్చు నాయక్ ఏసీబీ అధికారులకు చిక్కారు.మెడిసిన్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ ఇబ్బంది పెట్టడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన కాంట్రాక్టర్.
శుక్రవారం లచ్చు నాయక్ ఇంట్లో రూ.3 లక్షల నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.సూపరిండెంట్ డాక్టర్ లచ్చు నాయక్ కు సంబంధించి ఏసీబీ అధికారులు ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నారు.







