నల్గొండ జిల్లా:మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాలపై విధించిన ట్రాఫిక్ జరిమానాలపై ఇచ్చిన డిస్కౌంట్ కు ఇక మూడు రోజుల గడువు మాత్రమే ఉంది.ఈ అవకాశం తేదీ:15-04-2022 సాయంత్రంతో ముగుస్తుంది.మరియు ఇకపై ఈ అవకాశం పొడిగించబడదు.కాబట్టి వాహానదారులందరూ మీ యొక్క వాహనాలపై ఉన్న చలాన్స్ క్లియర్ చేసుకోగలరు.అలాగే ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు,బంధువులకు తెలియపరచగలరని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వము ఇచ్చిన డిస్కౌంట్లో భాగంగా టూ వీలర్/ త్రీ వీలర్ వెహికల్స్ పై ఉన్న చలానాలపై 75% డిస్కౌంట్,ఫోర్ వీలర్,హెవీవెహికల్స్ కి 50% డిస్కౌంట్,కరోనా సమయంలో మాస్కు పెట్టుకోని కారణంగా వేసిన కేసులలో 90% డిస్కౌంట్ ఇవ్వడం జరిగిందన్నారు.
కావునా వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ యొక్క అవకాశాన్ని మీ యొక్క నెట్ బ్యాంకింగ్ లేదా పేటియం ద్వారా గానీ,మరియు మీ దగ్గరలోని మీసేవ కేంద్రంలో సంప్రదించి గానీ,మీ వెహికల్ పై ఉన్న పెండింగ్ చలాన్స్ ను చెల్లించగలరని చెప్పారు.