యాదాద్రి భువనగిరి జిల్లా:రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు డీసిపీ కె.నారాయణరెడ్డి తెలిపారు.
జిల్లా కేంద్రంలోని స్థానిక డీసిపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భువనగిరి జిల్లా కేంద్రంలో మరియు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పేరుతో అమాయకులను మోసం చేస్తూ కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘరానా మోసగాళ్లను బాధితుల ఫిర్యాదుతో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.వారి వద్ద నుండి బంగారం,పట్టా ల్యాండ్ పేపర్లు,లాప్ టాప్ లు,సెల్ ఫోన్ లతో పాటు సుమారు ఐదు కోట్లు నగదు రికవరీ చేసి, నిందితులను రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.
షేక్ మహమ్మద్ షాకీర్,మహమ్మద్ అబ్దుల్ రెహమాన్,మహమ్మద్ అబ్దుల్ రాకీబ్, షేక్ మహమ్మద్ హుస్సేన్ లు ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు.వీరందరూ కలిసి నేరం చేసినట్టు ఒప్పుకున్నందున అరెస్టు చేసి కోర్టుకు పంపామన్నారు.