సీఎం గారూ మా గోడు ఆలకించండి సారూ: గొల్ల కురుమలు

నల్లగొండ జిల్లా: గొల్ల కురుమల ఆర్ధిక స్థితిని మెరుగుపరచడానికి అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్ల పంపిణీ పథకం తీసుకొచ్చామని చెప్పినప్పటికీ,కేవలం ఎన్నికల వచ్చినపుడు మాత్రమే హడావుడి చేసి, వారి నుండి డీడీలు కట్టించుకోడం,ఆ డీడీల ద్వారా వచ్చిన డబ్బులు పెట్టి కొద్దిమందికి గొర్లు పంపిణీ చేయడంతో క్షేత్రస్థాయిలో సంపూర్ణంగా అమలు చేయడంలో విఫలమైందని అనేక విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.ఇదే తరహాలో గత సాధారణ ఎన్నికల ముందు ఎలాంటి ప్రణాళిక లేకుండా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విచ్చలవిడిగా ఒకే ఇంట్లో ఇద్దరి ముగ్గురి చొప్పున వందలాది మంది చేత ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా డీడీలు కట్టించుకున్నారని,కానీ, వారిలో కేవలం ఎన్నికల ముందు ఓ పది శాతం మందికి గొర్లు పంపిణీ చేసి,ఎన్నికల్లో గెలిచాక మిగతా వారికి అందజేస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసిర్రని వాపోతున్నారు.

 Cm Sir Listen To Our Problems Golla Kurumas, Golla Kurumas, Sheep Distribution,-TeluguStop.com

దీంతో వడ్డీలకు డబ్బులు తెచ్చి గొర్లకు డీడీ కట్టిన గొల్ల కురుమల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని,రోజురోజుకీ వడ్డీభారం పెరుగుతుందని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొర్ల పంపిణీకి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని గొర్లను అయినా ఇవ్వండి లేదంటే మా డబ్బులు మాకైనా ఇప్పించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.జర మా గురించి ఆలోచించండి సారూ అంటూ గుర్రంపోడ్ మండలం బుడ్డరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బొమ్ము లింగయ్య అంటున్నారు.మేము గత సంవత్సరం మే నెలలో రూ.43,750 పెట్టి డీడీ కట్టినం.ఎన్నికల ముందు చాలాసార్లు గొర్ల యూనిట్ల మంజూరు గురించి సాగర్ మాజీ ఎమ్మెల్యే భగత్ ని అడిగినా సరిగ్గా స్పందించలేదు.కొద్ది మందికే గొర్లు మంజూరు చేసి ఆపేసిర్రు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గొల్ల కురుమల పక్షాన ఆలోచించి గొర్ల యూనిట్లు మంజూరు చేస్తే బాగుంటదని వేడుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube