నీళ్లు లేక ఎండిన పొలం గొర్రెలకు మేతగా మారిన వైనం

సూర్యాపేట జిల్లా: మోతె మండలంలోని రాంపురం తండాలో పొట్ట దశకు వచ్చిన వరిపొలం నీళ్ళు లేక ఎండిపోయి గొర్రెలకు మేతగా మారిందని కొర్ర కిషన్ అనే కౌలు రైతు కంట కన్నీళ్లు పెట్టుకున్నారు.బాధిత రైతు మాట్లడుతూ 5 ఎకరాల భూమిలో వరి పొలం సాగు చేస్తున్నానని, బావిలో నీళ్లు ఇంకిపోయి బోర్లు పొయ్యక పంట పొలం పూర్తిగా ఎండిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రూ.1000 లకు గొర్ల కాపరికి అమ్ముకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

 No Water Dry Field Is Used As Fodder For Sheep, No Water , Dry Field , Sheep, Wa-TeluguStop.com

కరువు మండలంలో ఉన్నా బోరు బావిని నమ్ముకొని సాగు చేస్తే నీళ్ళు సరిపడా లేక మొత్తం ఎండిపోయిందని వాపోయారు.

కౌలుకు తీసుకున్న భూమికి కౌలు ఇవ్వక తప్పదని,పెట్టిన పెట్టుబడికి,మందులకు అప్పులు చేశానని,ఈ పరిస్థితిలో తనను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube