ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీ కొట్టిన కారు...వైద్య సిబ్బందికి గాయాలు...!

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని రామన్నపేట వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అడవిదేవులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ వెంకట్,ఏఎన్ఎంలు ముత్యాలమ్మ,సైదమ్మ, భాగ్యలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు,బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…అడవిదేవులపల్లి పి.

 The Car That Hit The Tractor That Was Stopped...injured The Medical Staff...!-TeluguStop.com

హెచ్.సి నుండి ముదుమాణిక్యం గ్రామంలో పైలేరియా సర్వే నిమిత్తం వైద్య సిబ్బంది కారులో వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో రామన్నపేట వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరగింది.

రోడ్డు వెంట నిలిపి ఉంచిన ట్రాక్టర్ కు రేడియం స్టిక్కర్లు లేకపోవడమే ప్రమాదానికి కారణమని,కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెనుప్రమాదం తప్పిందని బాధితుడు వెంకట్ తెలిపారు.గాయపడిన వైద్య సిబ్బందిని మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube