మర్రిగూడ నూతన ఎంపీపీగా గండికోట రాజమణి హరికృష్ణ

నల్గొండ జిల్లా: మర్రిగూడ మండలం,తిరుగండ్లపల్లి ఎంపీటీసీ గండికోట రాజమణి మర్రిగూడ నూతన ఎంపీపీగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.గత కొన్ని నెలల క్రితం బీఆర్ఎస్ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టగా ఆయన కోర్టు నుండి స్టే తెచ్చుకోవడంతో నిలిచిపోయింది.

 Gandikota Rajamani Harikrishna Is The New Mpp Of Marriguda, Gandikota Rajamani H-TeluguStop.com

స్టే ఆర్థర్ గడువు పూర్తి కావడంతో ఆర్డీవో సమక్షంలో పెట్టిన ఎంపీపీపై అవిశ్వాసం నెగ్గింది.వైస్ ఎంపీపీ కట్కూరు వెంకటేష్ కొన్ని రోజులుగా ఇంచార్జ్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు.

శుక్రవారం జెడ్పి డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు నిర్వహించిన ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీపీగా గండికోట రాజమణి ఒక్కరే నామినేషన్ వేశారు.

మొత్తం 11 మంది ఎంపీటీసీలు ఉండగా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీటీసీలు హాజరయ్యారు.సరియైన పోరం సభ్యులు హాజరై మద్దతివ్వడంతో ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు జెడ్పి డిప్యూటీ సీఈవో ప్రకటించారు.

తమ ఎన్నికకు సహకరించిన ఎంపీటీసీ సభ్యులకు,పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తానని నూతన ఎంపీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, ఎంపీడీవో చినమున్నయ్య, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్నమనేని రవీందర్ రావు,మండల పార్టీ అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube