నల్లగొండ జిల్లా: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ముందుకు తీసుకురాకుండా అడ్డుపడుతున్నారని బీజేపీ మహిళా మోర్చ జాతీయ కార్యదర్శి పద్మజ మీనన్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ…ఆయుష్మాన్ భారత్ పథకం 2018లో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టినప్పటికీ నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అమలు కాకపోవడం వలన ఎంతో మంది పేద ప్రజలు వారి యొక్క అనారోగ్య రీత్యా పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంగన్వాడి స్కూల్లలో అర్బన్ హెల్త్ సెంటర్లలో కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఇవన్నీ నడుస్తుంటే ఈ రాష్ట్రం ప్రభుత్వం తమ పేరు చెప్పుకుంటుందని ఆరోపించారు.ఈ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న అనేకమైన సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో తామే చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుందన్నారు.
నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకపోవాలని మహిళా మోర్చ శ్రేణులకు పిలుపునిచ్చారు.అంతకు ముందు జిల్లా కేంద్రంలోని పలు అంగన్వాడి కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు కొండేటి సరిత,బీజేపీ రాష్ట్ర నాయకురాళ్లు కంకణాల నివేదిత రెడ్డి,కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి,జిల్లా ఇన్చార్జి బండారు శైలజ,మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు నేవర్సు నీరజ,మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రావేలా కాశమ్మ, హైమావతి,భవాని, గుగులోతు తార,బీజేపీ రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి,నాగం వర్శిత్ రెడ్డీ,బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.