ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత బోండా ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.జగన్.
ప్రజలను ఫూల్స్ చేస్తూనే ఉన్నారని విమర్శించారు.నిన్న బీజేపీ నేతపై జరిగిన దాడి వెనుక వైసీపీ కిరాయి గూండాల హస్తం ఉందని ఆరోపించారు.
జగన్ నవరత్నాల్లో ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేదని మండిపడ్డారు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది పేదలకు పలు కారణాలతో పెన్షన్లు ఎగ్గొట్టారని విమర్శించారు.కరెంట్ ఛార్జీలు పెంచి రూ.57 వేల కోట్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఢిల్లీలో పైరవీలు చేయడానికి 31 మంది వైసీపీ ఎంపీలు ఉన్నారని పేర్కొన్నారు.టీడీపీ -జనసేన మధ్య వివాదాలు సృష్టించేందుకే ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు.సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులతో వైసీపీ ప్రచారం చేస్తోందని విమర్శలు గుప్పించారు.