నందమూరి బాలకృష్ణ.మాస్ ప్రేక్షకులు అందరికి కూడా పూనకాలు తెప్పించే సినిమాలకు కేరాఫ్ అడ్రస్.
ఇక నందమూరి బాలకృష్ణ పేరు చెబితే చాలు పవర్ ఫుల్ డైలాగులు అబ్బురపరిచే ఫైటింగ్ సీన్లు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి.ఒకవేళ బాలకృష్ణ ఏదైనా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.
ఈ సినిమాలో పైట్ సన్నివేశాలు లేవు అంటే చాలు ప్రేక్షకులు తెగ హర్ట్ అయి పోతూ ఉంటారు.ఎందుకంటే కెరీర్ మొదటి నుంచి మొదలుపెడితే మొన్నటి అఖండ వరకు బాలకృష్ణ సినిమాల్లో ఫైటింగులు ఉండాల్సిందే.
బాలయ్య విలన్ లను చితక్కొట్టాల్సిందే.ఇక ఇలా బాలయ్య కెరీర్ లో ఇప్పటివరకు చేసిన సినిమాలలో ఫైటింగులు పవర్ ఫుల్ డైలాగులు లేని సినిమా ఎంత వెతికినా దొరకదు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది అభిమానులు.
ఒకవేళ అలాంటిదేదైనా సినిమా వచ్చినా అది అట్టర్ ప్లాప్ కావడం ఖాయం అని అంటూ ఉంటారు.కానీ ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ ఆయన సినిమా బాలయ్య కెరీర్ లో ఒకటి ఉంది.
అదే నారి నారి నడుమ మురారి.ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో బాలయ్య సరసన శోభన,నిరోషా హీరోయిన్లుగా నటించారు.ఇక ఈ సినిమాలో శారద, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ లాంటి భారీ తారాగణం కూడా ఉంది.యువ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై కె మురారి ఈ సినిమాను నిర్మించడం గమనార్హం.
కె వి మహదేవన్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించారు.
సినిమా బాలయ్య కెరీర్లోనే 50వ చిత్రం కావడం గమనార్హం.అయితే స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలయ్య కెరీర్ లో ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా మరీ ముఖ్యంగా ఎలాంటి ఫైటింగ్ సన్నివేశాలు లేకుండా తెరకెక్కింది నారీ నారీ నడుమ మురారి సినిమా.1990 ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమా విడుదలైంది.యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణను ఇక ఈ సినిమాతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అందరూ టెన్షన్ పడ్డారు.కానీ ఈ సినిమా అభిమానులకు తెగ నచ్చేసింది.
దీంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.మరీ ముఖ్యంగా మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు అనే చెప్పాలి.
కె వి మహదేవన్ సమకూర్చిన సంగీతం సినిమాకి మరింత ప్రాణం పోసింది.ఈ సినిమాలో బాలయ్య నటనకు కామెడీ టైమింగ్ ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు.