కాకర కాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.కాకరకాయ కొంచెం చేదుగా ఉన్నా సరే బాగా ఉపయోగపడే ఆహారం అని చెప్పవచ్చు.
కాకరకాయను ఫ్రై లేదా స్టఫ్డ్ చేసి తినవచ్చు.అలాగే దీనిని ఆహారంలో సంప్లిమేంట్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
కాకరకాయను క్రమం తప్పకుండా ఉడికించి తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.ఇక్కడ కాకరకాయ మనకు ఆరోగ్య విషయంలో ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం.
1.టైప్ II డయాబెటిస్
కొన్ని అధ్యయనాల్లో కాకరకాయ గ్లూకోజ్ జీవక్రియను పెంచి బ్లడ్ షుగర్ ని
తగ్గిస్తుందని తెలిసింది.ప్రతి రోజు ఒక కప్పు కాకరకాయ రసాన్ని త్రాగాలి.కాకరకాయ పూర్తి ప్రయోజనం పొందాలంటే కూర చేసుకోవాలి.ఆహారంలో మార్పులు
ఉంటే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.ఒకవేళ కడుపు నొప్పి,
విరేచనాలు, జ్వరం వంటివి ఉంటే కాకరకాయను తీసుకోవటం మానేయాలి.రక్తంలో
చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకొని,దానికి అనుగుణంగా
డాక్టర్ సాయంతో మందులు వాడాలి.
2.మూత్రపిండాల్లో రాళ్లు
మూత్రపిండాల్లో రాళ్లు అనేవి చాలా బాధాకరమైన పరిస్థితి.మూత్రపిండాల
నుండి రాళ్లు సహజసిద్దంగా బయటకు వచ్చేలా కాకరకాయ సహాయపడుతుంది.
కాకరకాయ మూత్రపిండాల్లో రాళ్లు ఉత్పత్తికి కారణం అయిన ఆమ్లాన్ని తగ్గిస్తుంది.కాకరకాయ పొడితో టీ తయారుచేసుకొని త్రాగవచ్చు.అయితే ఈ టీ కొంచెం వగరుగా ఉంటుంది.
3.కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది
కాకరకాయ ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది.కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గటం వలన గుండెపోటు, గుండె జబ్బు, మరియు
స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి.హై కొలెస్ట్రాల్ ని రక్త పరీక్ష ద్వారా
మాత్రమే నిర్ధారణ చేయవచ్చు.ఆరోగ్య ప్రమాదాలను నివారించటానికి కాకరకాయ
సహజంగా పనిచేస్తుంది.
4.ప్యాంక్రియాటిక్ క్యాన్సర్
కాకరకాయలో క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు ఉండటం అనేది ఆశ్చర్యకరమైన ఆరోగ్య
ప్రయోజనాలలో ఒకటిగా చెప్పవచ్చు.
కాకరకాయ గ్లూకోజ్ ఉత్పత్తికి అంతరాయం కలిగించి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణాల వృద్ధిని సమర్ధవంతంగా నిరోదిస్తుంది.అలాగే కాలేయం, పెద్దప్రేగు, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల వృద్దిని నిరోదించటానికి కూడా సహాయపడుతుంది.
5.చర్మ ప్రయోజనాలు
కాకరకాయను ఆహారంలో లేదా పానీయంగా గాని తీసుకుంటే చాలా చర్మ ప్రయోజనాలు
ఉంటాయి.
కాకరకాయను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారటమే కాకుండా మోటిమలు, సోరియాసిస్, తామర వంటి వ్యాధులను కూడా నిరోదిస్తుంది.అలాగే సహజంగా ఉపశమన అనుభూతిని కలిగిస్తుంది.
అదనంగా కాకరకాయ రక్త శుద్ధి ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది.