మగవారికి మాత్రమె వచ్చే 5 చిత్రమైన రోగాలు

వ్యాధులు వేలరకాలు.అందులో 99% వ్యాధులు మనిషి శరీరంపై దాడిచేస్తాయి.

 5 Diseases Only Men Has To Suffer With-TeluguStop.com

అంటే స్త్రీ, పురుషుడు అనే తేడా ఉండదు.అవి ఏ శరీరంలో అయినా పెరగొచ్చు.

కాని కొన్ని వ్యాధులు ఉంటాయి, కొన్ని కేవలం స్త్రీ శరీరానికే అంటుకుంటాయి, కొన్ని కేవలం పురుషుడి శరీరానికే అంటుకుంటాయి.అంటే ఈ వ్యాధులు శరీర నిర్మాణాన్ని బట్టి వస్తాయి అన్నమాట.అందులో ఈ రోజు కేవలం మగవారికే వచ్చే 5 రోగాలను తెలుసుకోండి.

 5 Diseases Only Men Has To Suffer With-5 Diseases Only Men Has To Suffer With-Latest News English-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టెస్టికులర్ క్యాన్సర్ :

బ్రీస్ట్ క్యాన్సర్ స్త్రీలకు వస్తుందని తెలుసు.కాని అదేరకమైన రొమ్ము క్యాన్సర్ పురుషులకి కూడా వస్తుంది.ఎందుకంటే ప్రతి బిడ్ద తల్లి కడుపులో మొదట స్త్రీ గానే ఉంటుంది.ఆ తరువాత క్రోమోజోమ్స్ ప్రభావం వలన మగ బిడ్డ, ఆడ బిడ్డ ఎవరి క్రోమోజోమ్ కాంబినేషన్ ని బట్టి ఆ లింగానికి మారిపోతారు/ఉండిపోతారు.ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే పురుషులకి నిపుల్స్ ఉండటానికి కారణం అదే.స్త్రీలకు వచ్చే బ్రెస్ట్ మగవారికి కూడా రావొచ్చు.కాని టెస్టికులర్ క్యాన్సర్ కేవలం మగవారికే వస్తుంది.ఎందుకంటే వృషణాలు కేవలం మగవారికే ఉంటాయి.

బ్లాడర్ లో రాళ్ళు :

కిడ్నీల్లో రాళ్ళు లింగభేదం చూసి రావు.అవి స్త్రీలకి అయినా, పురుషులకి అయినా వచ్చేస్తాయి.కాని బ్లాడర్ లో రాళ్ళు పురుషులకే వస్తాయి.బ్లాడర్ లో మినరల్ బిల్డప్ ఎకువ అవడం వలన లేదా మూత్రం ఎక్కువ మోతాదులో ఆపి ఉంచే అలవాటు ఉండటం వలన ఇవి ఏర్పడతాయి.దీంతో మూత్రంలో మంట, కడుపు నొప్పి ఎలాగో ఉంటాయి, వీరితో పాటు పురుషాంగంలో విపరీతమైన నొప్పి పుట్టవచ్చు.

బట్టతల :

బట్టతలని వ్యాధిగా గుర్తించాలా వద్ద అనే ప్రశ్నను కాసేపు పక్కనపెడితే, ఈ సమస్య్ మాత్రం పురుషులకి వచ్చేదే.మరి స్త్రీలకు వెంట్రుకలు ఊడవా అంటే ఊదుతాయి కాని హెయిర్ ఫాల్ ఉంటుంది, పురుషుల మాదిరి బట్టతల రాదు.

ఈ బట్టతల ఎందుకు వస్తుంది అంటే అతిపెద్ద కారణం జీన్స్.తండ్రికి బట్టతల ఉంటే కొడుక్కి కూడా రావొచ్చు.అమ్మాయిలకి జుట్టు రాలితే దాన్ని బట్టతల అనడం ఎప్పుడైనా విన్నామా ?

ఆల్పోర్ట్ సిండ్రోం :

ఇదేం జబ్బు, దీని గురించి ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా.ఇది చాలా అరుదుగా తలెత్తే సమస్య లెండి.

జీన్స్ వలన వస్తుంది, అందులోనూ కేవలం పురుషుల ప్రాణాలనే తీస్తుంది.ఈ సిండ్రోం వస్తే ఒకేసారి కిడ్నీలు, కనులు, చెవులు పనిచేయడం తగ్గిస్తాయి.

సైలెంట్ గా ప్రాణాలు ఎగరేసుకుపోతుంది.మరి ఇది స్త్రీలపై ఎందుకు ప్రభావం చూపదు అంటే, స్త్రీలలో రెండు X క్రోమోజోమ్స్ ఉంటాయి.

కాని పురుషులలో కేవలం ఒకటే X క్రోమోజోం ఉంటుంది కదా.అందుకే పురుషుడి శరీరం ఈ జబ్బు ముందు బలహీనం.

పెరోనిజ్ :

సహజంగా పురుషాంగం కొంచెం ఎడమవైపుకి వంగి ఉంటుంది.దీన్ని చూసి కంగారుపడకండి.

సహజమే అన్నాం కదా.కాని పెరోనిజ్ అనే వింత వ్యాధిని జీన్స్ ద్వారా పొందేవారి పురుషాంగం చాలా ఓవర్ గా వంగిపోతుంది.ఎంతలా వంగుతుంది అంటే వారు శృంగారం చేయడం కష్టం.అంతే కాకుండా పురుషాంగం సైజు తగ్గిపోతుంది.ఇక అంగస్తంభనల గురించి మరిచేపొండి.

Video : 5 Diseases Only Men Has To Suffer With -

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube