అగమ్యగోచరం ఆశా వర్కర్ల జీవనం

నల్లగొండ జిల్లా:రోజూ గొడ్డుచాకిరే,ఉద్యోగ భరోసాలేదు, జీతం చారెడు విధులు బారెడు,ఆశా వర్కర్ ధనమ్మకు ప్రజానేస్తం,కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బహిరంగ లేఖ.గ్రామీణ భారత ఆరోగ్యానికి మూలస్తంభాలుగా నిలుస్తున్న ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత,జీవన ప్రమాణాల నాణ్యత కొరబడ్డాయని సిపిఐ (ఎంఎల్) కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ,ప్రజానేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు.

 The Life Of Asha Workers Is Unfathomable-TeluguStop.com

తన కుటుంబ బంధువు,నాయనమ్మ,నందారపు ధనమ్మ గౌడ్ తాళ్ళఊకళ్లు గ్రామంలో ఆశా వర్కర్ గా పని చేస్తున్నదని,భర్తను కోల్పోయి పుట్టేడు దుఃఖంలో ఉన్నప్పటికీ తన ముఖంలో మాత్రం ఎల్లప్పుడూ చెదరని చిరునవ్వుతో ప్రతి ఇంటిని ధనమ్మ గౌడ్ సందర్శించి,అందరి యోగక్షేమాలు విచారిస్తాదని,పౌష్టికాహారం,పారిశుద్ధ్యం,ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి ప్రతిరోజు ప్రజలకు వివరిస్తుందని,సురక్షిత ప్రసవం,తల్లిపాల ప్రాధాన్యం,శిశు సంరక్షణ,వివిధ రకాల వ్యాధుల పట్ల చైతన్యాన్ని పెంపొందిస్తుందని,కొవిడ్ కాలంలోనూ ప్రాణాలను లెక్కచేయకుండా ఆశా వర్కర్ ధనమ్మ గౌడ్ ఇల్లిల్లూ తిరిగి సర్వేలు చేసిందని,టీకాలు వేసిందని ప్రజానేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న అభినందించారు.మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం ఊకళ్ళు గ్రామానికి చెందిన తన తండ్రి బోరా చంద్రన్న యాదవ్ 9701487102 కరోనా బారిన పడితే ఆశ వర్కర్ ధనమ్మ ఎంతగానో జాగ్రత్తలు చెప్పి,జీవితం పట్ల బ్రతుకు ధైర్యాన్ని ఇచ్చిందని సుభాషన్న గతం గుర్తు చేసుకున్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్నలు రైతక్కలు సమస్యలతో ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టుగానే,36 సంవత్సరాల క్రితం తన తల్లి బోరా లక్ష్మీ యాదవ్ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిందని ప్రజా నేస్తం బొరన్నగారి నేతాజీ సుభాషన్న కన్నీరు పెడుతున్నారు.తల్లి,రైతు బిడ్డ బోర లక్ష్మి యాదవ్ అమరురాలైన తర్వాత నాన్న ఒంటరిగానే కాలమెల్లదిస్తున్నాడని,తన అన్న బోర లింగన్న యాదవ్ 9398705112,9951718865 గొర్రెల మేకల వ్యాపారిగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం మక్తా కొత్తగూడెం గ్రామంలో తన భార్య ఎల్లక్కా యాదవ్, పెద్ద కొడుకు లెనిన్ యాదవ్,చిన్న కొడుకు స్టాలిన్ యాదవ్ లతో జీవిస్తున్నాడని,తన చెల్లి జటంగి రేణుకా,బావ సైదయ్యా యాదవ్ 9347862846 సాధారణ రైతుగా బొప్పారం గ్రామంలో కొడుకు నవీన్ యాదవ్ కూతురు నవ్య యాదవ్ తో కలిసి జీవిస్తున్నారని,తాను బ్రతుకుపోరులో కూతురు బి.ఎస్.ఆర్.ఝాన్సీలక్ష్మీబాయి,పెద్దకొడుకు బి.వి.ఆర్ మహాత్మా గాంధీజీ,చిన్న కొడుకు బి.జె.ఆర్.సర్దార్ పటేల్ లతో కలిసి హైదరాబాదులో ఉండటం వల్ల, ముగ్గురు మూడు ప్రాంతాలలో ఉండటం వలన తన తండ్రి ఒంటరిగా ఊకల్లు గ్రామంలో జీవిస్తున్నాడని,తోడు నీడ, లేక బాధపడుతున్నాడని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.తోడు లేక ఒంటరిగా జీవిస్తున్న తన తండ్రి కరోనా బారిన పడితే ఆశ వర్కర్ ధనమ్మతో పాటు మహబూబాద్ ప్రభుత్వ హాస్పిటల్ నర్సులు డాక్టర్లు ఎంతగానో సేవలు అందించారని ప్రజా నేస్తం సుభాషన్న అభినందించారు.ఊకళ్లు గ్రామంలోలో నందారపు ధనమ్మ గౌడ్ 9908437487 లాంటి ఆశ వర్కర్లు,తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా లక్షలాదిమంది ప్రతిరోజు ప్రజలకు ఎంతగానో వెలకట్టలేని సేవలు అందిస్తున్నారని, అటవీ,పర్వత ప్రాంత గ్రామాలకు కాలినడకన చేరుకొని ఆరోగ్య సేవలందిస్తున్నారని,కొందరు కరోనా మహమ్మారికి బలయ్యారని ప్రజా నేస్తం సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.

భారత్ లోని పది లక్షల మంది ఆశా వర్కర్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది మేలో గ్లోబల్ హెల్త్ లీడర్స్ పురస్కారాన్ని ప్రకటించిందనీ,ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో ఆశా వర్కర్లు కీలకంగా ఉన్నారని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీసుభాషన్న కొనియాడారు.ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో ఆశా వర్కర్లు ముందున్నారని సుభాశన్న ప్రశంసించారు.

సమాజ శ్రేయస్సుకు ఎంతగానో శ్రమిస్తున్న ఆశా వర్కర్లకు స్వల్ప వేతనమే లభిస్తోందని,విపరీతమైన పని ఒత్తిడిని తన కుటుంబ బంధువు,ఆశా వర్కర్ ధనమ్మ గౌడ్ లాగానే దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఆశ వర్కర్లు ఎదుర్కొంటున్నారనీ,ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.కరోనా వేల రోగులకు ఆశ వర్కర్లే ఆశగా నిలిచారని సుభాషన్న పేర్కొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అందరిని వణికిస్తున్న కరోనా మహమ్మారి గ్రామీణ ప్రాంతాలకు పాకి, కుటుంబాలకు,కుటుంబాలే అంతరించాయని,కొన్ని కుటుంబాల్లో ఎవరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా “ఆశా” ముందుండి సూచనలు,సలహాలు అందించారని,అనేక కుటుంబాల్లో కరోనా కరాళ నృత్యంతో బంధాలు తెగిపోతున్న విపత్కర పరిస్థితుల్లో కరోనాకు ఎదురొడ్డి,రోగుల ఇళ్ళ వద్దకు నేరుగా వెళ్ళి వైద్యం చేసీ, వారిలో మనోధైర్యాన్ని నింపరాని,మీ ప్రాణాలకుమేమున్నామంటూ,కరోనా బాధితులకు అండగా ఉన్నారని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న ధనమ్మ గౌడ్ తో పాటు లక్షలాదిమంది ఆశవర్కర్ల సేవలను ప్రశంసించారు.సమాజం కోసం సేవే లక్ష్యంగా,ప్రేమే మార్గంగా ఇంత గొప్ప త్యాగాలు చేస్తున్న ఆశా వర్కర్ర్లుచాలా తక్కువ వేతనంతోనే విధులు నిర్వహిస్తున్నారని బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.

గర్భిణీలకు,రోగులకు అండగా ఉంటూ,వారి ఆరోగ్యాన్ని అమ్మలా చూస్తున్నారనీ, ఆశా కార్యకర్తలు విధి నిర్వహణలో తలకు మించిన భారం, శ్రమ అధికమవుతున్నా,నిరుత్సాహం చెందక వారి సేవలను నిరంతరం అందిస్తున్నారని,అయినప్పటికీ చాలీచాలని వేతనంతో ఇబ్బందులు పడుతున్నారని ప్రజానేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.నవమాసాలు మోసి జన్మనిచ్చేది అమ్మ,తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మనిషి మరణించే వరకు సేవలు అందించేది “ఆశా”.

గర్భిణీలకు,బాలింతలకు,పసిపిల్లలకు,బాలలకు,పెద్దలకు, వృద్ధులకు అందరికీ దిక్కు “ఆశా కార్యకర్తలే “.తల్లిలా లాలిస్తూ,బుజ్జగిస్తూ,మాటలు పడుతూ,విధినిర్వహణలో తనకుతానే సాటి,ఆశాలా సేవలు చేసేందుకు ఎవరుముందుకు రారనీ సుభాషన్న పేర్కొన్నారు.ఆశా వర్కర్లకు ఎవరూ ఇండ్లు అద్దెకు ఇవ్వడానికి ముందుకు రావడం లేదనీ,ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో ఆశాలకు తప్పనిసరిగా ఇవ్వాలనీ, ఆశాలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం,పెన్షన్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలనీ,పీఆర్సీ,ఏరియర్స్ను వెంటనే చెల్లించాలనీ,కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలయెన్స్ బకాయిలను చెల్లించాలనీ,పెండింగ్ యూనిఫామ్స్ను వెంటనే ఇవ్వాలనీ,క్వాలీటితో కూడిన పూనమ్ క్లాత్ శారీస్ ఇవ్వాలనీ,పారితోషికం లేని అదనపు పనులను చేయించరాదనీ,జిల్లా ఆస్పత్రుల్లో రెస్ట్ రూమ్లను ఏర్పాటు చేయాలనీ,ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ ప్రజానేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న డిమాండ్ చేశారు.వైద్య ఆరోగ్య శాఖలో అతి తక్కువ వేతనంతో విధులు నిర్వహిస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే వారు “ఆశా” కార్యకర్తలు మాత్రమేనని ప్రతి “ఆశా” కార్యకర్త స్థానికంగా నివాసం ఉంటూ ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని ఉన్నతాధికారులకు తెలియజేస్తారు.”ఆశా” వర్కర్ల ముఖ్య విధి గర్భిణీలకు, బాలింతలకు,పిల్లలకు,వృద్ధులకు మందులను,టీకాలను, పౌష్టికాహారం ఇవ్వడం.ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేందుకు “ఆశా”లు ఎంతో దోహదపడుతున్నారనీ, కరోనా ప్రారంభమైనప్పటి నుంచి అదనంగా కోవిడ్ విధులను కూడా నిర్వహిస్తున్నారనీ,ఇన్ని రకాలుగా సేవలందిస్తున్న వారికి ప్రభుత్వం నుంచి అరకొర వేతనాలు మాత్రమే అందుతున్నాయనీ,కరోనా విధుల్లో పాల్గొన్న ప్రత్యేక అలవెన్సులు నేటికీ రాలేదని ప్రజా నేస్తం సుభాషన్న ఆరోపించారు.

ఆశ వర్కర్లనుసూటిపోటీ మాటలంటూ అధికారులు వేధిస్తున్నారనీ,ఆరోగ్య సూత్రాలను అందరికీ చెబుతున్నా ఆశ వర్కర్లు,ఆరోగ్య సూత్రాలను ఆశ వర్కర్లు పాటిస్తే మాత్రం అధికారులతో తిట్లు తినాల్సి వస్తోందనీ, నీరు ఎక్కువగా తీసుకోవడంతో టాయిలెట్లకు వెళ్లినా, నెలసరి సమయంలో ఇబ్బందుల గురించి చెబుతుంటే హేళన చేస్తున్నారనీ,కరోనా సమయంలో అద్దె ఇండ్లల్లో నుంచి చాలామంది ఆశలను గెంటేశారనీ,అధికారుల ఈసడింపులు,సమాజం నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్న ఆశలను ప్రభుత్వమే అన్ని రకాలుగా ఆదుకోవాలని ప్రజా నేస్తం బోరన్నగారి సుభాషన్న ముఖ్యమంత్రినీ డిమాండ్ చేశారు.ఆశ కార్యకర్తల వెతలు పాలకులకు కనీసం పట్టడం లేదని ప్రజానేస్తం బొరన్నగారినేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని అక్షరాల అమలు చేయాల్సి ఉండగా పాలకులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ ఆశ కార్యకర్తలను వెట్టిచాకిరికి గురిచేస్తున్నారనీ,వైద్య ఆరోగ్యశాఖ అందించే సేవలు అమలుకావాలంటే క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల పాత్ర కీలకమనీ,ఆశా కార్యకర్తలకు అధికారులు అందించే వేతనం దినసరి కూలీ కంటే అధ్వాన్నంగా ఉందనీ,వెట్టిచాకిరి చేయించుకుని అరకొర పారితోషికం ఇస్తున్నారనీ, శ్రమకు తగిన ఫలితం అందకపోవడంతో ఆశావర్కర్ల కుటుంబాలు పూట గడవని స్థితిలో ఉన్నారనీ,ఉద్యోగులకు ప్రతినెలా చెల్లించే ప్రభుత్వం, ఆశా కార్యకర్తలను పూర్తిగా విస్మరిస్తున్నదనీ,ఏళ్ళ తరబడి వెట్టిచాకిరి చేస్తున్న అధికారులు వారిపై కనికరం చూపడం లేదనీ,గ్రామాల్లో వైద్య సిబ్బంది వచ్చినా,రాకపోయినా తమ విధులను రోజంతా అంకిత భావంతో చేస్తున్నారనీ,ఆరోగ్య విషయంలో ఎన్నో సేవలు అందిస్తున్నారనీ, ఆశలని మాత్రం అధికారులు చిన్నచూపు చూస్తున్నారనీ,భారమైన విధులతో దుర్భర జీవితాన్ని నెట్టుకు వస్తున్నారనీ,సమస్యలు పరిష్కరించాలని ధర్నాలు,దీక్షలు చేసినా ఎవరూ స్పందించక పోవడంతో ఆశా కార్యకర్తలు నిరాశలతో విధులు నిర్వహిస్తున్నారనీ,శ్రమకు తగిన ఫలితంకోసం ఎదురుచూపులు తప్పడంలేదనీ,ప్రభుత్వం ప్రజారోగ్యంపై ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ముందుగా గుర్తుకువచ్చేది ఆశా కార్యకర్తలేనని,ఆశా కార్యకర్తలకు తగిన వేతనాలు ఇవ్వకపోగా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారనీ,ఉపాధి పనులకు వెళ్ళే కూలీలకు సైతం రోజుకు రూ.100 నుండి రూ.150 సంపాదిస్తారు.అంతకంటే అధ్వాన్నంగా ఆశల వేతనాలు ఉన్నాయనీ,రోజంతా రెగ్యులర్ ఉద్యోగులతో పనిచేస్తే అరకొర జీతాలు అందించడం అన్యాయమని ప్రజా నేస్తం బోరన్న గారి నేతాజీ సుభాషన్న తీవ్రంగా బాధపడ్డారు.

ఉద్యోగం చేయలేక,ఉన్న ఉద్యోగం వదులుకోలేక సతమతం అవుతున్నారనీ,వచ్చే అరకొర వేతనం కూడా సకాలంలో రాకఇబ్బంది పడుతున్నారనీ,ఆశా కార్యకర్తలు గ్రామాల్లో వైద్య సిబ్బందితో సమానంగా సేవలందించడంలో వీరి పాత్ర కీలకమనీ,గర్భిణిలు,బాలింతలు,హెచ్.ఐ.వి.శుభ్రత,పల్సపోలియో,డి.ఇ.సి.మాత్రల పంపిణీ,ఎనామిక్ సమయంలో 108 వచ్చిన సమయంలో వ్యాధి నిరోధక కార్యక్రమం కుటుంబ నియంత్రణ ప్రోత్సహించడం,క్షయ కుష్టు రోగులను గుర్తించడం,బరువుతక్కువ ఉన్న పిల్లల వివరాలను పిహెచ్కు తెలియజేయడం,విధులను అన్నీ తామై విధులు నిర్వహిస్తున్నారనీ,నిరంతరం ప్రజలకూ సేవలందిస్తున్నవారికి కనీస వేతనం అందక పోవడం దారుణమైన అన్యాయమని అభ్యుదయ వాది బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రసూతి కేసుకు రూ.300 పిల్లలకు ఇచ్చే టీకాలకు ఒక్క కేసుకు రూ.180 గర్భిణీ పేరు నమోదుచేస్తే రూ.30 చెల్లిస్తారనీ,ఇక పల్స్ పోలియోలో పాల్గొంటే రోజుకు రూ.75, సర్వేలు ఇతర సేవలకు రూ.350 వరకు చెల్లిస్తారనీ ఇవికూడా చేతికి అందేవరకు నమ్మకం లేదనీ ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా 2005లో ఆశా వర్కర్ల వ్యవస్థ ప్రారంభమైందనీ,దేశంలో ప్రతి వెయ్యి మంది జనా భాకు ఒక ఆశా వర్కర్ ఉండాలనీ,భారత్ లో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయడంలో ఆశ వర్కర్లు కీలక భూమిక వహిస్తున్నారని ప్రజా నేస్తం సుభాషన్న పేర్కొన్నారు.ఇండియాలో ఆస్పత్రి ప్రసవాల పెరుగుదల,మాతా,శిశు మరణాల రేటును తగ్గించడంలో ఆశా వర్కర్లు కీలకంగా నిలుస్తున్నారనీ,భారత్ లో శిశు మరణాల రేటు 1981లో 9.7శాతం.ఉండగా,2021 నాటికి అది 1.7శాతానికి తగ్గిందనీ ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న తెలిపారు.గ్రామీణ ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషించేఆశా వర్కర్లు పలు సమస్యలతో తమతమవుతున్నారనీ సుభాషన్న తీవ్రంగా బాధపడ్డారు.సరైన వేతనం లేక,పని ఒత్తిడి ఎక్కువై ఇబ్బందులు పడుతున్నారనీ,ప్రభుత్వాలు వారిపై శీతకన్ను వేస్తున్నాయనీ, మాతా మరణాలూ గతంతో పోల్చుకుంటే చాలా దిగివచ్చాయనీ,ఆశా వర్కర్ల సేవలను ప్రభుత్వాలు గుర్తించినా,వారి సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనీ,ఆశ వర్కర్లు శాశ్వత ఉద్యోగులు కారనీ,ప్రోత్సాహక వేతనమే తప్ప నియమిత జీతం ఆశ వర్కర్లకు లేదనీ,ప్రజారోగ్య రక్షణకు ప్రభుత్వం చేపట్టే ప్రతి పనీ ఆశ వర్కర్లకే అప్పగిస్తున్నారనీ,కొన్ని రాష్ట్రాల్లో రోజువారీ లక్ష్యాలు విధిస్తున్నారనీ,తెలుగు రాష్ట్రాల్లో టీబీ నిర్మూలన,టీకా వితరణ,అసాంక్రామిక వ్యాధుల గుర్తింపు, మలేరియా,డెంగీ వంటి వ్యాధుల నియంత్రణ,మాతా శిశు సంరక్షణ తదితరాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలనూ ఆశా వర్కర్లే నిర్వర్తిస్తున్నారనీ ప్రజా బంధువు బోరన్నగారి నేతాజీ సుభాషన్న తెలిపారు.

ఆశ వర్కర్లకుఆదివారం సైతం సెలవు లేకపోవడంతో ఆశలపై తీవ్ర పనిభారం పడుతోందనీ ప్రజా నేస్తం సుభాషన్న పేర్కొన్నారు.హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 50 లక్షలకుపైగా జనాభా ఉంది.94 బస్తీ దవాఖానాలు,50కిపైగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయనీ,వీటితోపాటు 2500 కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్య విషయాలను ఆశా కార్యకర్తలు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ పై అధికారులకు చేరవేస్తూ ఉండాలి.హైదరాబాద్ జిల్లా జనాభా,కుటుంబాల సంఖ్య ఆధారంగా 2500 మంది ఆశావర్కర్లు ఉండాలి.

కానీ, ప్రస్తుతం 1,895 మంది మాత్రమే ఉన్నారనీ,తెలుగు రాష్ట్రాల్లో అన్నీ జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆశాల సంఖ్య తక్కువగా ఉండటంతో పనిభారం పెరిగిందనీ,రోజుకు సుమారు 14 గంటలపాటు పనులు చేయిస్తున్నారని ఆశాలు ప్రభుత్వాల దృష్టిలో మనుషులుగా కనబడటం లేదా ? అని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న ముఖ్యమంత్రులను ప్రశ్నించారు.ఆశావర్కర్లను నియమించుకున్న అసలు పనిని పక్కనబెట్టి ఇతర పనులు చేయిస్తూ వారిపై ఒత్తిడి పెంచడం ఎంతవరకు సమంజసమని,ఆశా వర్కర్లు ప్రతి కుటుంబంలో తల్లీపిల్లల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఆశా మాస్ డాక్టర్గా వ్యవహరిస్తోంది.కానీ, ఎన్నికల విధులు,బూతుస్థాయి అధికారిగా,ఏమైనా జాతీయ,రాష్ట్ర స్థాయి పరీక్షలు నిర్వహిస్తే అక్కడ ట్యాబ్లెట్స్ అందించే డ్యూటీలు వేస్తున్నారనీ,సెలవులు కూడా ఇవ్వకుండా వెట్టీ పనులు చేయిస్తున్నారనీ ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆశా వర్కర్ల తరఫున బాధను వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆశా వర్కర్ల పై రాజకీయ ఒత్తిళ్లు అధికమవుతున్నాయనీ,వెయ్యి మందికి ఒక ఆశ వర్కర్ ను నియమిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఐదు వేల మందికి ఒకరిని నియమించారనీ,గ్రామాలలో విధులు నిర్వహించే వర్కర్లను సచివాలయాలకు అనుసంధానం చేశారనీ,దీంతో దూరప్రాంతాలకు వెళ్లడం వల్ల రోజూ రూ.300 వరకు ఖర్చు అవుతుందనీ,ఆశాలకు నిర్దేశించిన విధులతో పాటు సంబంధిత అధికారులు ఇతర పనులు చెబుతూ వెట్టి చాకిరీ చేయిస్తున్నారనీ,ఆసుపత్రుల్లో బండలు శుభ్రం చేయించడం,ఆవరణలో క్లీన్ అండ్ గ్రీన్ చేయించడం జరుగుతుందనీ,ఏఎన్ఎంలు వెంట తీసుకు వెళ్లే వ్యాక్సిన్ క్యారియర్ బాక్సులను ఆశల వద్ద పెట్టి ప్రతిరోజు తీసుకువచ్చేలా ఒత్తిడి చేస్తుంటారనీ,అధికారులు చెప్పిన పని చేయని ఆశలను విధుల నుంచి తొలగిస్తూ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారనీ,అమ్మఒడి,వితంతు,వికలాంగ, ఒంటరి మహిళ పింఛనులను ఆశ వర్కర్లకు తొలగించారనీ ప్రజా బంధువు బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.’ప్రతి నెలా కొత్తగా గర్భిణులను గుర్తించి నాలుగింటిని తప్పనిసరిగా నమోదు చేయాలి.ఒక వేళ ఆ నెలలో ఎవరూ గర్భం దాల్చకుంటే ఆశ కార్యకర్తల కూ చీవాట్లు,చీత్కారాలు,రిమార్కులు తప్పడం లేదని,లేని సంఖ్యను ఎలా నమోదు చేస్తారని,వర్కర్లు కూడా మనుషులే అనే విషయాన్ని అధికారులు అర్థం చేసుకోవాలని,ఆశావర్కర్ల ఆవేదన మనసుపెట్టి చూడాలని, ఆశా వర్కర్లను నియమించిన ఉద్దేశం ‘మాతా-శిశు మరణాల నివారణ’కానీ,ఆశా వర్కర్లతో అన్ని పనులూ చేయిస్తున్నారనీ ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకు అన్నీ చూసుకుంటున్న ఆశా వర్కరూ ఓ మహిళే.కానీ,విధి నిర్వహణలో మహిళలకు సంబంధించిన సమస్యల గురించి పైఅధికారులకు చెబితే నానా బూతులు తిడుతూ నరకయాతన పెడుతున్నారు.

చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొందని ఆశావర్కర్ల తరపున బాధితుల బంధువు ప్రజానేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న ముఖ్యమంత్రిలకు రాసిన రాసిన బహిరంగ లేఖల ఆవేదన సుభాషన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చాలా రాష్ట్రాల్లో ఆశా వర్కర్ల సంఖ్య కేంద్రం నిబంధనలకు అనుగుణంగా లేదనీ,ఆశ వర్కర్ల సంఖ్యను పెంచి,పనిభారాన్ని తగ్గించాలనీ,వేతనాలను సైతం పెంచాలనీ,జీతాల పెంపు,ఇతర సౌకర్యాల కోసం ఆశా వర్కర్లు ఎన్నో సార్లు మొరపెట్టుకొన్నా వందల వేల ఉద్యమాలు ధర్నాలు,సమ్మెలు చేసినా పాలక వర్గాలు నిమ్మకు నీరెత్తిన రీతిలో నిరదాక్షిణ్యంగా వ్యహరిస్తున్నాయని ప్రజా నేస్తం బోరన్న గారి నేతాజీ సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.పోరాటాల ఉద్యమాల ఫలితంగా ఆశ వర్కర్లవేతనాన్ని రూ.7500 నుంచి రూ.9750కు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిరుడు ఉత్తర్వులు ఇచ్చిందనీ,రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యవసరవస్తుల ధరల ముందు ఈ వేతనాలు ఏమాత్రం ఆశ లా జీవితాలకు సరిపోవడం లేదని,కనీస వేతనంగా రూ.30,000 ఇవ్వాలని ఆశా వర్కర్ల తరపున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న డిమాండ్ చేశారు.గ్రామాలు,9 పట్టణాలు కలిపి తెలంగాణలో 27 వేల మంది,ఆంధ్రప్రదేశ్లో సమారు 40 వేలమంది ఆశావర్కర్లు పని చేస్తున్నారనీ,వారానికి ఒక రోజు సెలవుతో పాటు,ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రసూతి సెల వులు వంటివి ఆశలకు అమలు చేయాలని ప్రజానేస్తం బోరన్నగారి నేత సుభాషన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను డిమాండ్ చేశారు.ఆశా వర్కర్ల ఉద్యోగానికి పూర్తి భద్రత కల్పించాలనీ,అధికారుల,రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తగ్గించాలి.

ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం వారి సేవలను విస్తృతం చేయాలనీ,వెట్టిచాకిరీ పనులను చేయించకూడదనీ,సచివాలయం అనుసంధానము నుంచి తప్పించి పాత పద్ధతిలో జనాభా ప్రకారంగా విధులు చేసేలా చూడాలనీ,60 ఏళ్ల వయసుతో నిమిత్తం లేకుండా విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలనీ తీసుకోవాలనీ, ప్రమాదంలో లేదా సాధారణంగా ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా ఇవ్వాలనీ,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనీ,వ్యాక్సిన్ క్యారియర్ బాక్సులు మోయించడం,బ్లీచింగ్ పౌడర్ చల్లించడం,క్లీన్ అండ్ గ్రీన్ పనులు చేయించడం మానుకోవాలనీ ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులకు రాసిన బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు.ఆశా వర్కర్లకు ప్రభుత్వాలు మంచిచేయూతనిస్తేనే అద్భుత ఫలితాలు సాధిస్తారని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు బహిరంగ లేఖల సూచించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించే అత్యుత్తమ వైద్య సేవల వివరాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఆశా వర్కర్ల ద్వారానే తెలుస్తాయనీ,ఒక ప్రభుత్వ పథకం విజయవంతమైతే,దాన్ని ఉన్నతాధికారులకే ఆపా దించడం పరిపాటిగా మారిందనీ,ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశా వర్కర్లకు ఇచ్చిన గుర్తింపు,ప్రశంస చూసైనా వారి విషయంలో ప్రభు త్వాలకు కనువిప్పు కలగాలనీ,చిరుద్యోగులైన ఆశా వర్కర్ల సేవలను గుర్తించి,వారి సమస్యల పరిష్కారానికి అడుగులు వేయాలనీ,విధి నిర్వహణలో వారికి సరైన రక్షణ,వాహన సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందనీ,ఆశలనూ స్కీం వర్కర్లుగా కాకుండా ప్రభుత్వ ఉద్యో గులుగా గుర్తించాలనీ, గ్రూప్ ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలనీ,పదోన్నతుల ద్వారా మరింత సమర్థంగా విధుల నిర్వహణకు ఆశ వర్కర్లకు ప్రోత్సాహం ఇవ్వాలనీ,విధి నిర్వహణలో మరణిస్తే పరిహారమూ అందించాలనీ,ఆశా వర్కర్ల సామర్థ్యాల పెంపుదలకు ఆధునిక సాంకేతికతతో కూడిన శిక్షణ ఇవ్వడమూ తప్పనిసరిగా ప్రారంభించాలని,అప్పుడే ప్రభుత్వ ఆరోగ్య పథకాలు మరింతగా విజయవంతమవుతాయనీ ప్రజానేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కలిపించి,పే-స్కేల్ వర్తింపజేయాలని,పని ఒత్తిడి తగ్గించాలనీ, రెగ్యులర్ గా యూనిఫామ్ అందించాలనీ,ప్రతి నెల రెగులర్ గా జీతాలు చెల్లించాలనీ,మైంటైన్ నెన్సు అలవెన్సులు అందించాలనీ సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ ప్రజా నేస్తం కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 9848540078 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను డిమాండ్ చశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube