స.హ.చట్టం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

నల్లగొండ జిల్లా:పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి నల్లగొండ జిల్లా ఇన్చార్జ్ మరియు వినియోగదారుల చట్టం నల్గొండ జిల్లా జాయింట్ సెక్రెటరీ మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పానగల్లు దగ్గర చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ అనాథాశ్రమంలో నిత్యావసర సరుకులు, పండ్లను నల్గొండ డిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు.

 Distribution Of Essential Commodities Under The Co-operative Act-TeluguStop.com

యువత కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.నజీర్ మాట్లాడుతూ యువత వృధా ఖర్చులు చేయటం కంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మానసిక ఉల్లాసాన్ని కలుగిస్తుందని సూచించారు.

ఈ కార్యక్రమంలో జావిద్,సుధాకర్, జీశాన్,రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube