మహిళా రక్షణలో షి టీమ్ బృందాలు: జిల్లా ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: షి టీమ్ బృందాలు మహిళా రక్షణలో ముందుంటూ ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తూ రక్షణ కల్పిస్తాయని,మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా పరిధిలో జనవరి నెలలో మొత్తం 23 ఫిర్యాదులు రాగ వాటి విచారణ అనంతరం 12 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.

 She Teams In Women Protection District Sp Chandana Deepti, She Teams ,women Prot-TeluguStop.com

షి టీమ్ బృందాలు జిల్లా వ్యాప్తంగా జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు, కళాశాలలు,మార్కెట్లు,  షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోటా డేగ కళ్లతో పర్యవేక్షణ చేస్తూ లైంగిక వేధింపులు,ఈవ్ టీజింగ్ మొదలగు ప్రతి అంశంలో మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తూ నిరంతరం ముందుకు సాగుతూ మన్ననలు అందుకుంటున్నాయని అన్నారు.నల్లగొండ షీ టీమ్స్ బృందాలు రక్షణ కల్పించే విషయంలోనే కాదు.

మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లకు  రావాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ డయల్ 100 ద్వారా, పోలీస్ శాఖ విడుదల చేసిన క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ పద్దతిలో, వాట్సప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించి నిరంతరం ఆపదలో ఉన్నవారికి వెన్నంటి నిలిచేలా ముందుకు సాగుతున్నాయన్నారు.

జనవరి నెలలో కొన్ని కేసుల వివరాలను వెల్లడించారు.

ఒక అమ్మాయికి షేర్ చాట్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి మొదట మంచిగా మాట్లాడి నమ్మించి ఆమె ఫోటోలు తీసుకొని తరువాత నా దగ్గరకి రమ్మని ఇబ్బంది పెట్టుచూ వేధిస్తుండగా షీ టిమ్ కి ఫిర్యాదు ఇచ్చినారని,ఈ ఫిర్యాదు విషయంలో షి టిమ్ పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించి పట్టుకొని వచ్చి కౌన్సిలింగ్ చేసి,మళ్లీ ఆ అమ్మాయి జోలికి వెళ్లకుండా చేసి  ఫోటోలు పూర్తిగా డిలీట్ చేయించి అతనిపై కేసు పెట్టడం జరిగిందన్నరు.ఫిర్యాది యొక్క కూతురు వెంబడి ఒక అబ్బాయి వెంటపడి ప్రేమించమని ఇబ్బంది పెట్టుచుండగా వాళ్ళు చెప్పిన కూడా వినకుండా అదే విధంగా వేధిస్తుండగా వాళ్ళు వేరే స్కూల్ కూడా ఛేంజ్  చేయగా,అతను అక్కడికి కూడా వెళ్ళి వేధిస్తుండగా అతని బాధ భరించలేక తట్టుకోలేక షీ టిమ్ కి వచ్చి ఫిర్యాదు ఇచ్చినారు.

ఫిర్యాదుపై అట్టి అబ్బాయిని మీద నిఘా పెట్టి పట్టుబడి చేసి అమ్మాయి జోలికి పోకుండా కౌన్సిలింగ్ చేసి, అతనిపై  కెసు పెట్టనైనది.సామాజిక మాధ్యమాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సామాజిక మధ్యమాలైన ఫేస్ బుక్,ఇన్ స్టా గ్రామ్ లలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాటి ద్వారా పరిచయం పెంచుకోవడం,ఫోటోలు తీసుకొని మోసం చేస్తున్న కేసులు,వాట్సప్ ఫోటోలను స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని మార్ఫింగ్ చేసి వాటినే ఆ అమ్మాయికి పంపి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని,అందువల్ల మహిళలు,యువతులు, అమ్మాయిలు చాలా జ్రాగ్రత్తగా ఉండాలని, సామాజిక మాధ్యమాలలో ఫోటోలు షేర్ చేసేటప్పుడు ఆలోచించి పోస్టు చేయాలని సూచించారు.అదే విధంగా పోస్ట్ చేసే ఫోటోలు ప్రైవసీలో ఉండేలా చూసుకోవాలని, సామాజిక మాధ్యమాలలో తెలియని ఫోన్ కాల్స్ వస్తే వాటిని ఎత్తవద్దని సూచిస్తున్నారు.

మైనర్ బాలికలపై,మహిళలపై లైంగిక వేదిపులు జరుగుతున్నా మీరు మొదటగానే మాకు తెలియపరిస్తే మీకు ఇబ్బంది లేకుండా చూడగలమన్నారు.మీరు చెప్పకుండా భయపడుతూ ఉంటే సమస్య పరిష్కారం కాకపోగా ఇంకా ఎక్కువ అవుతుందన్నారు.

కాబట్టి మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చెప్పగలరని తెలిపారు.మహిళా సమస్యలపై ఫిర్యాదు చేయడానికి సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు…నల్లగొండ జిల్లా SHE Team No: 8712670235,జిల్లా ఎస్పీ 8712670200,నల్లగొండ జిల్లా షీ టీమ్స్ ఇంచార్జీ ఆర్.గోపి,సిఐ ఆఫ్ పోలీస్ 8712596748, మిర్యాలగూడ ఇంచార్జీ ఎస్ఐ కోటేష  8096004465 నెంబర్లకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube