నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ నుంచే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల నుంచి భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.ఇదిగో దసరా,సంక్రాంతి,అదిగో శివరాత్రి,ఉగాది అంటూ ప్రజలను పండుగల పేరుతో పరేషాన్ చేయడం ఏమిటని వాపోతున్నారు.
ఇదిలా ఉండగా పండగల పేరు చెప్పి పథకాల అమలు గురించి ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ సర్కార్ కాలం గడుపుతోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.అప్పట్లో దసరా పండుగకు కొత్త రేషన్ కార్డులు అన్నారు.
తరువాత సంక్రాంతి, శివరాత్రి,మళ్ళీ ఇప్పుడు ఉగాది పండుగకు కొత్త రేషన్ కార్డులు అంటున్నారని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.పండుగలు వచ్చి పోతున్నాయి కానీ, రేషన్ కార్డులు రావట్లేదని, ఉగాదికి అయినా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు.