పాముల వీడియోలు( Snake Videos ) సోషల్ మీడియాలో ఇటీవల తరచుగా వైరల్‌గా మారుతున్నాయి.అడవుల్లో, పంటపొలాల్లో, చెరువుల్లో కనిపించే పాములు ఇప్పుడు మన ఇళ్లలోనూ, వాహనాల్లోనూ కనిపించడం కామన్ అవుతుంది.
నెటిజన్లు పాముల వీడియోలను ఆసక్తిగా చూసి, ఆశ్చర్యపోతున్నారు.ఇటీవలి కాలంలో పాములు వివిధ రకాల అనూహ్య ప్రదేశాల్లో కనిపిస్తున్న వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా వైరల్ అయిన వీడియోలో( Viral Video ) ఒక పెద్ద పాము (సుమారు 6 అడుగుల పొడవు) వేగంగా వచ్చి ఒక షూస్‌లో దాక్కుంది.

అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని తమ ఫోన్‌లో రికార్డు చేశారు.పాము షూస్‌లోకి( Shoes ) వెళ్లి ముడుచుకుని ఉండిపోవడం అందరినీ భయాందోళనకు గురిచేసింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.
విషయాన్నీ గమనించిన ఇంట్లో ఉన్నవారు వెంటనే స్నేక్ క్యాచర్‌లకు సమాచారం ఇచ్చారు.వారు వెంటనే వచ్చి పామును సురక్షితంగా పట్టుకుని, అడవిలో విడిచిపెట్టారు.ఈ ఘటనను చూసిన నెటిజన్లు, “వారిది అదృష్టం” అని అభిప్రాయపడుతున్నారు.

పామును గమనించకుండా షూస్‌లో చేతులు పెట్టి ఉంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో అని భయపడుతున్నారు.ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటూ జాగ్రత్తలు పాటించాలంటున్నారు.ముఖ్యంగా పిల్లలు, పెద్దలు ఇళ్లలో, ఆరుబయట ఉండే షూస్, బట్టలు వంటివి ఉపయోగించే ముందు బాగా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ఎండల వల్ల పాములు చీకటిగా, చల్లగా ఉండే ప్రదేశాల్లో దాక్కుంటాయనే విషయం గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.మరికొందరేమో ఇది చూసిన తర్వాత మరోమారు షూ వేసుకోవాలంటేనే భయమేస్తుందని కామెంట్ చేస్తున్నారు.







