సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) పేరు వినగానే క్రికెట్ అభిమానులకు గూస్‌బంప్స్ వచ్చేలా ఉంటుంది.16 ఏళ్ల వయసులోనే భారత జట్టుకు అరంగేట్రం చేసి, క్రికెట్ ప్రపంచాన్ని తన బ్యాటింగ్‌తో పరవశింపజేశాడు.సచిన్ ఆటతీరులోని శైలి, సరళత, ఆటపట్ల అతని ప్రేమ ప్రతి ఒక్కరినీ మెప్పించింది.2013లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా.ఇంకా అభిమానుల్లో క్రేజ్ తగ్గలేదు.ప్రస్తుతకాలంలోనూ లెజెండరీ లీగ్‌లు, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో బరిలోకి దిగుతూ క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నాడు.ఇప్పటికే చాలా మంది రిటైర్డ్ క్రికెటర్లు వివిధ లీగ్‌లలో ఆడుతూ కనిపిస్తున్నారు.కానీ, 52 ఏళ్ల వయసులోనూ సచిన్ టెండూల్కర్ ఇంతటి ఆటతీరును ప్రదర్శించడం నిజంగా ప్రశంసనీయమైన విషయం.
ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20-2025లో( International Masters League T20-2025 ) సచిన్ తన బ్యాటింగ్ సత్తాను చాటుతున్నాడు.రిటైర్డ్ క్రికెటర్లతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో భారత్ తరఫున ఆడుతూ వరుసగా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు.
తాజాగా జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో( Australia Masters ) జరిగిన పోరులో తన బ్యాటింగ్ మాయను చూపించాడు.ఈ మ్యాచ్ లో కేవలం 33 బంతుల్లోనే 64 పరుగులు సాధించాడు.ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సులతో దుమ్మురేపాడు.193 స్ట్రైక్ రేట్‌తో పాతికేళ్ల కుర్రాడిలా ఆడుతూ అభిమానులను ఉర్రూతలూగించాడు.భారీ షాట్లే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తూ బౌలర్లను ఊచకోత కోశాడు.అయితే, సచిన్ మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ మిగతా బ్యాటర్లు మాత్రం నిరాశపరిచారు.దీంతో ఆస్ట్రేలియా మాస్టర్స్ కుదుర్చిన 269 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది భారత జట్టు.కేవలం 174 పరుగులకే ఆలౌట్ అయి, ఓటమి పాలైంది.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో షేన్ వాట్సన్ (110 నాటౌట్), బెన్ డంక్ (132) అద్భుత సెంచరీలతో భారత బౌలర్లను గట్టిగా టార్గెట్ చేశారు.
ఈ మ్యాచ్‌లో సచిన్ చూపించిన ప్రతిభపై క్రికెట్ ప్రపంచం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.వయసు అనేది కేవలం సంఖ్యే అని సచిన్ మరోసారి నిరూపించాడని కామెంట్ చేస్తున్నారు.ఇప్పటికీ క్రికెట్ పిచ్‌పై ఆ మేజిక్ క్రీయేట్ చేయగలడని అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు చేసిన సేవలు, అతని ఆటతీరులోని క్లాసికల్ టచ్ ప్రతి తరం క్రికెట్ అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తాయి.52 ఏళ్ల వయసులోనూ యువ క్రికెటర్లను సైతం సవాలు చేసేలా ఆడుతున్న అతని అంకితభావం నేడు కూడా అందరికీ ఆదర్శంగా మారింది.ఈ మాస్టర్స్ లీగ్‌లో సచిన్ మరిన్ని అద్భుతాలు చేస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.