అందుసాధువుల చేతిలో కర్ర ఎందుకు ఉంటుందో తెలుసా?

మన హిందూ సంప్రదాయం ప్రకారం సాధువులు, స్వామీజీలు ఎప్పుడూ కాషాయ వస్త్రాలు ధరించి… చేతిలో ఒక కర్రను పట్టుకొని కనిపిస్తుంటారు.అసలు చేతిలో కర్రను ఎందుకు పట్టుకోవాలో మాత్రం చాలా మందికి తెలియదు.

 What Is The Reason Behind Saints Use The Sticks In Their Hands , Saints , Stic-TeluguStop.com

అయితే స్వామీజీలు, సాధువులు చేతిలో కర్రను ఎందుకు పట్టుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సాధువులు, స్వామీజీలు సర్వసంగ పరిత్యాగం చేస్తారు.

సన్యాసం స్వీకరించే సమయంలో కాషాయ వస్త్రాలతో పాటుగా దండం చేత పట్టుకోవాలి.అంటే కర్ర చివరన కాషాయ జెండా ఉండే దండాన్ని పట్టుకోవాలి.

అది కాయక, వాచిక, మానసిక నియంత్రణకు చిహ్నం.అంటే మనస్సు, వాక్కు( మాటలు ) చేతలు అందుపులో ఉంచుకొని లక్ష్యం చేరాలి.

తప్పుడు మాటలు అస్సలే మాట్లాడ కూడదు.ఎవరికీ హానీ చేయ కూడదు.

మానసికంగా కానీ, భౌతికంగా కానీ ఎవరినీ బాధించకూడదు.అలాగే మాంసాహారం వంటివి తినకూడదు.

భగవంతుడి సాక్ష్యాత్కారమే లక్ష్యం.దీన్ని ఎప్పుడూ గుర్తుంచు కోవడానికే దండాన్ని ఎల్లప్పుడూ చేతులో ఉంచుకోవాలి.

 అయితే మనిషి పంచ భూతాల సమ్మేళనమే కాబట్టి యతులు ఐదడుగుల పొడవైన కర్రను పట్టుకొని ఉంటారు.ఆ కర్రల్లో ఏక దండి, ద్విదండి, త్రిదండి అని భేధాలున్నా… అద్వైత సిద్ధాంతులు ఒకే ఒక కర్రను చేత ధరిస్తారు.

రెండు కర్రలను కలిపి ఒకటిగా కట్టి చేత ధరించి బోధనలు చేసే వారు దైవ సిద్ధాంతం గలవారు.మూడు కర్రలను కట్టగా భుజాన తగిలించుకునే వారు కూడా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube