రాజకీయ వర్గాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.అలాగే శాశ్వత శత్రువులు కూడా ఉండరనే నానుడి ఉంది.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య రాజకీయాలు అలాగే ఉంటున్నాయి.తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే.2019 ఎన్నికల సమయంలో కేసీఆర్‌కు జగన్, జగన్‌కు కేసీఆర్ సహకరించుకున్నారన్న కామెంట్లు కూడా వినిపించాయి.అయితే అదంతా గతమని తెలుస్తోంది.
ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ కొత్త స్కెచ్ వేశారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ ఫడరల్ ఫ్రంట్ నినాదం ఎత్తుకున్నారు.
ఫడరల్ ఫ్రంట్‌కు జగన్ అతిపెద్ద ఇరుసుగా ఉంటారని కేసీఆర్ భావించారు.అందుకే దేశమంతా తిరిగినా జగన్ వద్దకు మాత్రం వెళ్లలేదు.
కనీసం ఏపీ వైపు తొంగి కూడా చూడటం లేదు.కానీ అనుకున్నదొక్కటి.
అయినదొక్కటి అన్న చందంగా కేసీఆర్ పరిస్థితి తయారైంది.జగన్ మోదీ పైపు చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇదే కేసీఆర్, జగన్ మధ్య వైరం పెంచిందని తెలుస్తోంది.
ప్రస్తుతం కేసీఆర్ అనుకున్న ఫడరల్ ఫ్రంట్ ప్లాన్ వికటించడానికి జగనే కారణం అని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.
సాటి తెలుగు రాష్ట్రం మద్దతు సాధించలేని కేసీఆర్ తమతో జట్టు కట్టి ఏం సాధిస్తారు అని పక్క రాష్ట్రాల వాళ్లు మాట్లాడుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.అందుకే ఎవరూ కేసీఆర్‌కు మద్దతు ఇస్తున్నట్లు బయటకు ప్రకటించలేకపోతున్నారు.

అటు ఏపీలో ప్రస్తుత రాజకీయాలు మారడంతో కేసీఆర్ కొత్త స్కెచ్ వేశారని గులాబీ నేతలు అంటున్నారు.ఏపీలో టీడీపీకి గ్రాఫ్ పెరగడం, చంద్రబాబుకు ఆదరణ గతంలో కంటే ఎక్కువ ఉండటాన్ని కేసీఆర్ నిశితంగా గమనిస్తున్నారని.దీంతో చంద్రబాబు మద్దతు కోరాల్సి ఉంటుందని టీఆర్ఎస్ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.గతంలో చంద్రబాబు యాంటీ మోదీ పక్షాలతో పనిచేశారని గుర్తుచేస్తున్నారు.ఫెడరల్ ఫ్రంట్‌కు చంద్రబాబు మద్దతు కూడా దక్కితే కేసీఆర్ జాతీయ రాజకీయానికి మంచి బలం ఏర్పడుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
.