సాధారణంగా మహిళలు 45, 50 సంవత్సరాల మధ్య రుతు విరతిలో ఉంటారు.మహిళల్లో పీరియడ్స్ ఆగిపోవడం, పీరియడ్స్ రావడం ప్రతి మహిళకు, అమ్మాయికి ఆరోగ్యకరమైన జీవనశైలి సూచిక.
అంతేకాకుండా సరైన సమయంలో పీరియడ్స్ ఆగిపోవడం కూడా వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారని సూచిస్తుంది.అయితే వీటన్నిటిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమంటే ప్రతి స్త్రీ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ఇక పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత శరీరం లోపల అన్ని కార్మోన్ల హెచ్చుతగ్గులు ఉంటాయి.అలాంటి సమయంలో ఆరోగ్యంపై చెడు ప్రభావం పడకుండా ఎలా ఆరోగ్యంగా ఉండాలో అవగాహన కలిగి ఉండాలి.

అయితే మెనోపాజ్( Menopause ) సమయంలో స్త్రీలు ఏం చేయాలి?వైద్యులు ఏమంటున్నారు? అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి మహిళ కూడా పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వెంటనే ఆసుపత్రికి పరిగెత్తడం, మళ్ళీ మళ్ళీ మందులు తీసుకోవడం లాంటివి చేస్తుంటారు.అయితే ఇలా చేయడం మంచిది కాదు.దీనికన్నా జీవనశైలిని మెరుగుపరచుకోవాలి.మీ శరీరంలో మార్పులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.దీంతో భవిష్యత్తులో ఎలాంటి సమస్య కూడా ఉండదు.
పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మహిళల్లో తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.అయితే మరింత ఎక్కువ ఆరోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం మంచిది.
అంటే పీచు పదార్థాలు, క్యాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది.

ఇక 30 ఏళ్ల తర్వాత మహిళల్లో ఎముకలు బలహీనం( Bones )గా మారడం ప్రారంభం అవుతాయి.అయితే అలాంటి సమయంలో ఆకుకూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి.అంతేకాకుండా ఉప్పు, సోడియం తగ్గించి తినాలి.
ఆహారంలో కాల్షియం పదార్థాలు అధికంగా తినాలి.ఎందుకంటే మెనోపాజ్ సమయంలో క్యాల్షియం చాలా అవసరం.
దీంతో ఎముకలు బలహీన పడవు.కాబట్టి పాలు, పెరుగు, గుడ్డు, చేపలు( Fish ) లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
మెనోపాజ్ తర్వాత అండాశయ క్యాన్సర్ స్త్రీల అండాశయాలలో మొదలయ్యి శరీర ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది.అందుకే మెనోపాజ్ సమయంలో సరైన ఆహారం తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి.
