మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వస్తున్న సినిమా గాంఢీవదారి అర్జున.ఈ సినిమా లో అఖిల్ ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్యా( Sakshi Vaidhya ) హీరోయిన్ గా నటిస్తుంది.
సినిమా ఈ నెల 25న రిలీజ్ అవుతుంది.ఎస్.
వి.సి.సి బ్యానర్ లో బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి ఇంకా వారం మాత్రమే ఉన్నా సినిమాకు ఏమాత్ర బజ్ ఏర్పడలేదు.వరుణ్ తేజ్ గని సినిమా ఎఫెక్టో మరేదో కానీ అసలు వరుణ్ తేజ్ సినిమాకు ఉండాల్సిన క్రేజ్ ఈ సినిమాకు రావట్లేదు.
సినిమా బిజినెస్ కూడా సోసోగానే జరిగిందని తెలుస్తుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ లో భారీ యాక్షన్ మూవీ( Gandeevadhari Arjuna )గా వస్తున్న ఈ గాంఢీవదారి అర్జున సినిమా ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచడంలో విఫలమవుతుంది.సినిమాపై ఇక నుంచైనా ప్రమోషన్స్ చేసి బజ్ పెంచాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు.వరుణ్ తేజ్ మాత్రం ఈ సినిమా తో పక్కా హిట్ కొట్టేస్తానని అంటున్నాడు.
అసలే ఏజెంట్( Agent ) తో ఫ్లాప్ అందుకున్న హీరోయిన్ కాబట్టి ఈ సినిమాకు బ్యాడ్ సైన్ అంటున్నారు మెగా ఫ్యాన్స్.