కె విశ్వనాథ్ గారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.సినిమాలపై ఆయనకు ఉన్న మక్కువ దర్శకుడుగా మార్చింది.
అనేక కళలను, అంతరించిపోతున్న విషయాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో సినిమాలు తీశారు.కానీ ఆయనను బ్రాహ్మణ ద్వేషిగా చిత్రీకరించి కులాల కుమ్ములాటలో నలిగిపోయేలా చేశారు కొంతమంది.
కానీ ఇప్పటికీ, ఎప్పటికీ కొన్ని అర్థం కాని విషయాలు ఖచ్చితంగా నేటితరం యువత తెలుసుకునే తీరాలి.మరి ముఖ్యంగా ఆయన తీసిన స్వయంకృషి సినిమా ప్రతి వ్యక్తి కూడా స్వయంగా కృషి చేస్తే తప్ప ఎదగలేదు అని చాటి చెప్పే విధంగా ఉంటుంది.
ఈ సినిమాకి ఎలాంటి దేవుడు నేపథ్యము లేదు.ప్రాచీన కళలు అంతరించిపోతున్నాయి అనే ఉద్దేశంతో తీసిన సినిమా స్వర్ణకమలం.

ఆ కళలను కాపాడాలి అని ఒకే ఒక్క ఆలోచనకు ఈ చిత్రం రూపం ఇచ్చింది.సినిమా అంటేనే ఒక కళాత్మకమైన ప్రయోగం.ఎలాంటి కథతో అయినా సినిమా తీసే అవకాశము దర్శకులకు ఉంటుంది.ప్రతిభ ఉంటే అది కళ అనే వస్తువుతో సినిమా తీయడం వల్ల ఆ విశ్వ వ్యాప్తంగా అవుతుంది అని విశ్వ నాథ్ గారు నమ్మారు.
శుభసంకల్పం సినిమా కూడా దాదాపు ఇలాంటి నేపద్యమే అందులో రెండు కులాల మధ్య ఉన్న గీత రెండు జాతుల మధ్య ఉన్న వైరం లాంటి అంశాలు ఉంటాయి.అవి రుపు మాపలని ఆయన ప్రయత్నం చేశారు.
ఇక సాగర సంగమం, స్వాతిముత్యం, స్వర్ణకమలం ఇది మూడు కూడా రకరకాల కళలను కళాత్మక దృష్టితో చూసి తీశారు విశ్వనాథ్ గారు.

ఇక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి దళిత యువకుడితో వివాహం జరిపించే సినిమా సప్తపది.దృష్టిలో అందరూ సమానులే మనుషుల ఆలోచనలలో మార్పు రావాలి సమానత్వాన్ని పాటించాలి అని విశ్వనాధ్ గారు చివరి వరకు ప్రయత్నించారు.అందుకే తన బ్రాహ్మణ కులానికి ద్రోహం చేసినట్టుగా వారు భావించేవారు.
బ్రాహ్మణ వ్యతిరేక సినిమాలో తీస్తున్నారు అనే అతడి పై కక్ష కూడా కట్టారు.మనిషి బావజాలంలో మార్పు రానంతవరకు ఏది చేసిన తప్పుగానే భావిస్తుంది ఈ లోకం.
ఆయన గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా ఆయన స్థాయి తగ్గదు ఎవరికోసం శిఖరం తలవంచదు.