సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లకు, నటీమణులకు ఒక్కొక్కరికీ ఒక్కో తరహా అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.కొంతమంది ఆ అనుభవాలను చెప్పుకోవడానికి ఇష్టపడితే మరి కొందరు ఆ అనుభవాలను చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు.
ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన జయలక్ష్మి( Actress Jayalakshmi ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.
నాకు ఇద్దరు పాపలు అని ఆమె అన్నారు.
జయం సినిమాలో( Jayam Movie ) నటించిన అమ్మాయికి హీరోయిన్ ఆఫర్లు వచ్చాయని అయితే అంగీకరించలేదని జయలక్ష్మి అన్నారు.అప్పుడు ఆలోచనా విధానం మరో విధంగా ఉండేదని ఆమె పేర్కొన్నారు.
ఆ తర్వాత కూతురికి పెళ్లి చేశామని మా హీరోయిన్ ఎలా ఉందని ఇప్పుడు కూడా అడుగుతారని ఆమె చెప్పుకొచ్చారు.నా చిన్న కూతురికి సినిమాలు అంటే ఆసక్తి అని జయలక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేశారు.

నా చిన్న కూతురు లండన్ లో యానిమేషన్ చదువుతోందని జయలక్ష్మి చెప్పుకొచ్చారు.ఇద్దరు కూతుళ్లకు ఏజ్ డిఫరెన్స్ ఎక్కువగానే ఉందని జయలక్ష్మి కామెంట్లు చేయడం గమనార్హం.చిన్న కూతురు త్వరలో సినిమాల్లోకి రావచ్చని ఆమె అన్నారు.చిన్నపాప పుట్టిన తర్వాతే మాకు లక్ మరింత కలిసొచ్చిందని ఆమె తెలిపారు.సీరియల్స్ లో ( Serials ) హెల్త్ బాలేకపోయినా చేయాల్సి వచ్చిందని జయలక్ష్మి అన్నారు.

నాకంత ఇబ్బంది ఎప్పుడూ కలగలేదని ఆమె తెలిపారు.అవకాశాలు రాని సమయంలో ప్రతిభ తగ్గిపోయిందా అని అనిపిస్తుంది అని ఆమె చెప్పుకొచ్చారు.నేను మోహన్ బాబు గారి( Mohan Babu ) సినిమా ఒకటి చేశానని దాసరి పద్మ గారి నుంచి నాకు ఛాన్స్ వచ్చిందని జయలక్ష్మి అన్నారు.
ఆ సినిమాలో పైట జార్చే సీన్ ఉందని ఆ సీన్ నేను చేయలేనని ఆమె తెలిపారు.నేను మోహన్ బాబు సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారని ఆమె తెలిపారు.
మోహన్ బాబు గారు తిట్టకుండా పంపించింది నేనే అని చెప్పారని జయలక్ష్మి తెలిపారు.







