ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) అంటే ఇండియా లో తెలియని వాళ్ళు లేరు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో తను ఒకరు అయితే తను కెరియర్ మొదట్లో చేసిన ఆర్య ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే అదే టైప్ లో ఆర్య 2 సినిమా(Arya 2 movie) కూడా చేయాలి ఆని అనుకొని చేశారు…అయితే ఈ సినిమా ప్లాప్ అయింది.ఈ సినిమా హిట్ అవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవెంటంటే…
అప్పటిదాకా క్లాస్ సినిమాలు చేసిన అల్లు అర్జున్ ఆ సినిమాలో చిన్న నెగిటివ్ టచ్ లో ఉండే పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు… కానీ ఈ సినిమాలో ఆయన చేసిన పాత్రనే మైనస్ అయింది ఎలా అంటే అప్పటి వరకు హీరో అంటే మంచి వ్యక్తి గా ఉండాలి అంతే కానీ ఇలా ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉన్న జనాలకి ఆయన చేసిన పాత్ర పెద్దగా ఎక్కలేదు…
ఇక దానికి తోడు సుకుమార్ (Sukumar) మేకింగ్ తోడైంది… అన్ని విధాలా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్ వల్లే ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా కోసం సుకుమార్ దాదాపు 2 సంవత్సరాల పాటు హార్డ్ వర్క్ చేసినట్టు తెలుస్తుంది…
ఇక ఆ తరువాత 100% లవ్, వన్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం ,పుష్ప లాంటి సినిమాలు చేశాడు.ఈ సినిమాలు కమర్షియల్ గా మంచి సక్సెస్ లు సాధించాయి.దానికి తోడు బాలీవుడ్ లో కూడా సుకుమార్ పేరు బాగా మారుమ్రోగుతుందనే చెప్పాలి.
ఇక పుష్ప 2 సినిమా కనక హిట్ అయితే ఆయన ఇంకా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు…
.