వేణు శ్రీరామ్(Venu sriram) డైరెక్టర్ గా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా సిద్దార్థ్ (Siddharth) హీరో గా వచ్చిన సినిమా ఓ మై ఫ్రెండ్…(Oh my friend movie) ఈ సినిమా లో సిద్దు, శృతి హాసన్ ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా నటించారు.అలాగే ఈ సినిమాలో హన్సిక హీరోయిన్ గా చేసింది.
శృతి హాసన్ ని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ కోసం మొదటగా ఈ చిత్ర బృందం హీరో నితిన్(Nithin) ని చేయమని అడిగారట అప్పుడు నితిన్ మొత్తం ప్లాప్ ల్లో ఉన్నాడు దాంతో నితిన్ ని ఈ రోల్ కి అడిగారు.

తను నేను చేయను అని చెప్పడంతో నవదీప్ ను ఈ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు సినిమాలో ఈ క్యారెక్టర్ కి పెద్దగా గుర్తింపు ఉండదు కానీ నవదీప్ ఈ క్యారెక్టర్ చేశారు అలా గుర్తింపు లేని క్యారెక్టర్ నితిన్ చేయకుండా వదిలేసిందే ఒక రకంగా బెటర్ అని చెప్పాలి లేకపోతే ఆ క్యారెక్టర్ చేసి ఉంటే నితిన్ గారిని అప్పుడు అన్ని ఇలాంటి క్యారెక్టర్స్ కోసమే డైరెక్టర్స్ అడిగేవారు కానీ 13 సినిమాలు ప్లాప్ అయినప్పటికీ ఏ మాత్రం భయపడకుండా ఇష్క్ అనే సినిమా చేసి మంచి సక్సెస్ సాధించాడు…ఆయన పట్టుదలకు మెచ్చు కావాల్సిందే…

అయితే ఈ సినిమా ప్లాప్ అయ్యాక డైరెక్టర్ వేణు శ్రీరామ్ నాని ని సాయి పల్లవిని పెట్టీ ఎం సి ఏ అనే సినిమా తీశాడు.ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా ఆడింది ఇక దాంతో హిందీ రీమేక్ అయిన పింక్ సినిమా ని తెలుగులో చేసే అవకాశం వచ్చింది అది కూడా పవన్ కళ్యాణ్ తో దీనికి కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారే…పవన్ కళ్యాణ్ తో వకిల్ సాబ్ అనే సినిమా పేరుతో తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు…ఇక ఇప్పుడు తొందర్లోనే ఒక స్టార్ హీరోతో మంచి సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది…
.







