కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహారాన్ని తీసుకోండి..!

ప్రస్తుత రోజులలో చాలా మంది మోకాలు, మోచేతి, వెన్నుముక, కీళ్లనొప్పులతో ( Joint pain )ఇబ్బంది పడుతున్నారు.చాలా మందిలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్ల నొప్పులు, వాపుల సమస్యలు పెరుగుతున్నాయి.

 Are You Suffering From Joint Pain.. But Take This Food, Joint Pain, Almonds, Pe-TeluguStop.com

దానికి తోడు వ్యాయామాలు చేయడంతో ఆ నొప్పులు ఇంకా విపరీతమవుతున్నాయి.అయితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

వారు ఎలాంటి ఆహారం తీసుకుంటే కీళ్లనొప్పుల సమస్య దూరం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.కీళ్ల నొప్పుల సమస్య ఉన్న వారు ప్రతి రోజు ఆహారంలో బాదం, వేరుశనగ, వాల్‌నట్స్‌ తీసుకుంటూ ఉండాలి.

ఇందులో ఎక్కువగా లభించే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.వీటిలో ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఈ కూడా ఎక్కువగా లభిస్తుంది.

వీటిని ఎక్కువగా ఆహారంలో చేర్చుకుంటే కీళ్ల నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.

Telugu Almonds, Calcium, Dark Chocolates, Fiber, Tips, Pain, Magnesium, Peanuts,

ఇంకా చెప్పాలంటే బెర్రీలు, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీల్లో( Strawberry ) యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.వీటిని ప్రతి రోజు తింటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.అంతే కాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

వీటి వల్ల శరీరానికి ఫ్రీ రాడికల్స్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.కూరగాయల్లో సల్ఫోరాఫేన్‌ కలిగిన ఆహారాలను తీసుకుంటే సులభంగా యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

కాబట్టి బ్రోకలీ కాలీఫ్లవర్లను ఆహారం లో తీసుకోవాలి.

Telugu Almonds, Calcium, Dark Chocolates, Fiber, Tips, Pain, Magnesium, Peanuts,

ముఖ్యంగా చెప్పాలంటే కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారు ఆలివ్ ఆయిల్ తో తయారుచేసిన ఆహారాలను తీసుకుంటే ఎంతో మంచిది.దీంతో శరీరం దృఢంగా మారడంతో పాటు కిల్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు డార్క్ చాక్లెట్ ( Dark Chocolates )తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి.

ముఖ్యంగా కీళ్లనొప్పులతో బాధపడేవారు రోజు వీటిని తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.మధుమేహం ఉన్నవారు కూడా డార్క్ చాక్లెట్ తినడం వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube