ఇటీవల ఎస్‌యూవీ కార్ల( SUV cars ) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.ఈ కార్లను వాడేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.
దీంతో ఎస్‌యూవీ కార్లకు ప్రపంచవ్యాప్తంగా బాగా డిమాండ్ పెరిగిపోయింది.ఇటీవల ఎక్కువమంది వీటినే కొనుగోలు చేస్తున్నారు.
దీంతో కంపెనీలు కూడా ఎక్కువ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి.అయితే ఎస్‌యూవీ అనగానే హ్యాచ్ బ్యాక్ వాహనాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు.
ఇవి కాస్త ఎక్కువ ఎత్తులో ఉండి ఐదుగురు వరకు కూర్చోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.అయితే తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎస్‌యూవీని తయారుచేశారు.
దీని ఎత్తు చాలా పెద్దదిగా ఉంటుంది.

దాదాపు 14 మీటర్లు పొడవు ఉండే అతిపెద్ద ఎస్‌యూవీ వెహికల్‌ను దుబాయ్ ఎమిరేట్స్ కంపెనీ( Dubai Emirates Company ) తయారుచేసింది.ఈ వాహనానికి హమ్మర్ హెచ్1( Hummer H1 ) అనే పేరును పెట్టారు.ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు.
దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.దీనిని H1 X3గా పిలుస్తున్నారు.
సాధారణ H1 ఎస్‌యూవీ కంటే ఇది మూడు రెట్లు పెద్దగా ఉంటుంది.అంతేకాకుండా యూఏఈఆల్ మేడమ్ ఆఫ్ రోడ్ మిస్టరీ మ్యూజియంలో దీనిని ప్రదర్శించారు.దీని ఎత్తు 6.6 మీటర్లు ఉండగా.పొడవు 14 మీటర్లు ఉంది.

ఇక 6 మీటర్ల వెడల్పు ఇది కలిగి ఉంది.అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన షేక్ మహద్ బిన్ హమ్దాన్ ( Sheikh Mahad bin Hamdan )అనే వ్యక్తి యాజమాన్యంలో ఈ కారు ప్రస్తుతం ఉంది.అతడే దీనిని తయారు చేయించాడు.
కానీ ఈ కారును ఎందుకు ఉపయోగిస్తారనేది తెలియడం లేదు.కేవలం షో కోసమే అతడు తయారుచేయించాడా? లేదా దీనిని ఆర్మీకి అప్పగిస్తాడా? అనేది తెలియాలి.హమ్మర్ ఎస్‌యూవీ వెహికల్స్ ను అమెరికా సైన్యంలో వాడతారు.ఆర్మీ సిబ్బందిన ఒక చోట నుంచి మరొక చోటుకు తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తారు.







