సర్పంచ్ ఇంట్లో పరిమళాలు... ఊరంతా గబ్బిలాల వాసన...!

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండల పరిధిలో సుమారు 300 కుటుంబాలకు పైగా నివాసముంటున్న బుగ్గబావిగూడెం గ్రామంలో చెత్తకుండీలు కన్పించవు, డ్రెయినేజీ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం,మురుగు నీటి కాలువలన్నీ చెత్తా చెదారంతో నిండిపోయి అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారడంతో దోమలు ఈగలు స్వైర విహారం చేస్తుండడంతో ప్రజలు సీజనల్‌ వ్యాధులతో అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల అవసరాలను గాలికొదిలి గ్రామ సర్పంచ్ తన నివాసాన్ని శుభ్రం చేసుకొని,నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటికి సిసి రోడ్డు నిర్మాణం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.

 The Whole Village Smells Of Bats, Nalgonda District, Buggabavigudem Village, Sar-TeluguStop.com

స్వచ్ఛభారత్‌ లో భాగంగా ప్రతి పల్లెనూ పరిశుభ్రంగా ఉంచి,రోగాలు లేని రాష్ట్రంగా చేయాలని చెబుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు ఈ గ్రామ సర్పంచ్ తూట్లు పొడుస్తున్నారని అంటున్నారు.

గ్రామాలను శుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం పంచాయతీలో ట్రాక్టర్ల ద్వారా సేకరించిన తడి,పొడి చెత్త వ్యర్థాలను, తరలించడానికి రూ.కోట్ల ఖర్చు చేస్తుంది.ప్రతి గ్రామానికీ చెత్త సేకరణ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం ఇన్ని వసతులు కల్పించినప్పటికీ అధికారులు,ప్రజా ప్రతినిధులు పట్టించుకోక పోవడంతో గ్రామ ప్రజలను సీజనల్‌ వ్యాధులు వెంటాడుతున్నాయని వాపోయారు.ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా పన్నులు వసూలు చేసే గ్రామపంచాయతీ అధికారులకు గ్రామ సమస్యలు పట్టకపోవడం దారుణమన్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెత్తకుండీలను ఏర్పాటు చేసి,డ్రైనేజీని శుభ్రం చేసి సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube