సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనక మిషన్ భగీరథ( Mission Bhagiratha ) వాటర్ పైపు పగిలి నీరు వృధాగా పోతుంది.గత కొన్ని రోజులు క్రితం ఇదే పైప్ లైన్ పగిలి నీరు పోతుండటంతో స్థానికులు సోషల్ మీడియా( Social media )లో పెట్టడంతో అధికారులు మరమ్మతులు చేశారు.
కానీ,ఇప్పుడు అదే పైప్ లైన్ మళ్ళీ పగలడంతో గత వారం రోజులుగానీళ్ళు పాలవుతున్నాయి.
ఇప్పటికే వర్షాలు సకాలంలో రాక,సాగర్ నీటి విడుదల చేయక, సతమతమవుతున్నారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో బోర్లు, బావులు కూడా అడుగంటిన క్రమంలో పట్టణంలో పలు వార్డుల్లో మున్సిపల్ నల్లా నీళ్ళు, మిషన్ భగీరథ నీళ్ళు సక్రమంగా రాక ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై ప్రజలుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు స్పందించి పైప్లైన్ మరమ్మత్తులు చేసి ప్రజలకు మిషన్ భగీరథ నీటిని అందించి,నీటి కష్టాలని తీర్చాలని కోరుతున్నారు.