ఎమ్మెల్యే కంచర్లతో తనకు ప్రాణహాని ఉంది:బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్

నల్లగొండ జిల్లా:నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అరాచకాల నుండి నియోజకవర్గాన్ని కాపాడాలని బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్ అన్నారు.ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తమ వర్గంపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఆయన తన అనుచరులతో కలిసి మంగళవారం జిల్లా కేంద్రంలోని రామాలయం గణేష్ విగ్రహం దగ్గర నుండి ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు భారీ ర్యాలీగా బయలుదేరగా ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడం కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

 Brs Dissident Leader Pilli Ramaraju Yadav Has Threatened His Life With Mla Kanch-TeluguStop.com

అనంతరం ఎస్పీ ఆఫిస్ కి వెళ్ళి అడిషనల్ ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తమ వర్గంపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని,భూపాల్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.

ఎమ్మెల్యే అరాచకాల నుండి తనను,తన అనుచరులను కాపాడాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube