ఎమ్మెల్యే కంచర్లతో తనకు ప్రాణహాని ఉంది:బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్
TeluguStop.com
నల్లగొండ జిల్లా:నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అరాచకాల నుండి నియోజకవర్గాన్ని కాపాడాలని బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్ అన్నారు.
ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తమ వర్గంపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఆయన తన అనుచరులతో కలిసి మంగళవారం జిల్లా కేంద్రంలోని రామాలయం గణేష్ విగ్రహం దగ్గర నుండి ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు భారీ ర్యాలీగా బయలుదేరగా ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడం కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
అనంతరం ఎస్పీ ఆఫిస్ కి వెళ్ళి అడిషనల్ ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తమ వర్గంపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని,భూపాల్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.
ఎమ్మెల్యే అరాచకాల నుండి తనను,తన అనుచరులను కాపాడాలని కోరారు.
అక్కడ ఫ్రీ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించిన ఉపాసన.. ఎంతో సంతోషంగా ఉందంటూ?