నల్లగొండ జిల్లా:ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి 20 తులాల బంగారం చోరీ చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి,వారి నుండి 20 తులాల బంగారం రికవరీ చేసి రిమాండ్ కు పంపినట్లు దేవరకొండ ఏ ఎస్పీ మౌనిక తెలిపారు.బుధవారం నల్లగొండ జిల్లా దేవరకొండ డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ వివరాలు వెల్లడించారు.
ఫిబ్రవరి 20వ,తేదీన దేవరకొండ పట్టణానికి చెందిన వాసు ఇంట్లో 20 తులాల బంగారం చోరీ కేసులో రెండు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి కేసును ఛేదించామన్నారు.హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అబ్దుల్ జాఫర్ అలియాస్ అహ్మద్,ఫసి,మోసీమ్ లను అరెస్టు చేసి వారి నుంచి 20 తులాల బంగారం రికవరీ చేయగా నైజల్ పరారీలో ఉన్నాడని,త్వరలో నైజాల్ ను కూడా పట్టుకుని అతని నుండి ఇంకా 6 తులాల బంగారం రికవరీ చేయనున్నట్లు పేర్కొన్నారు.







